పుష్ప 2 ఎఫెక్ట్.. రాంచరణ్, బాలయ్య సినిమాల పరిస్థితి ఏంటి.. ఆశలు వదులుకోవాల్సిందేనా 

First Published | Dec 8, 2024, 3:30 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 600 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు సోమవారం కూడాకొనసాగితే పుష్ప 2 బ్లాక్ బస్టర్ సాధించినట్లే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 600 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు సోమవారం కూడాకొనసాగితే పుష్ప 2 బ్లాక్ బస్టర్ సాధించినట్లే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన అభిమానుల తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఈ సంఘటన అటు చిత్ర యూనిట్ ని, ఇటు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసేలా చేసింది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం కోసం బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తుంటాయి. కానీ ఇలా అభిమానం శృతి మించినప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. చిత్ర యూనిట్ ఆ మహిళ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. 


అయితే ఈ సంఘటన తెలంగాణ ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసేలా చేసినట్లు తెలుస్తోంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇదే కనుక జరిగితే సంక్రాంతికి రాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలపై తీవ్ర ప్రభావం పడ్డట్లే అని అంటున్నారు. 

గతంలో అజిత్ నటించిన తెగింపు చిత్ర రిలీజ్ రోజున తమిళనాడులో కూడా ఓ అభిమాని మరణించారు. రిలీజ్ సెలెబ్రేషన్స్ చేసుకుంటూ జరిగిన ప్రమాదంలో మరణించాడు. దీనితో తమిళనాడు ప్రభుత్వం బెనిఫిట్ షోలని రద్దు చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఫ్యాన్స్ ఇకపై స్టార్ హీరోల చిత్రాల బెనిఫిట్ షోల విషయంలో ఆశలు వదులుకోవాల్సిందే. 

Latest Videos

click me!