శ్రీయ, ఆర్తి అగర్వాల్ లతో నటించిన క్రేజీ హీరోని చులకనగా చూసిన ఇలియానా.. చివరికి కోటి రూపాయలతో డీల్ 

First Published | Dec 8, 2024, 2:48 PM IST

ఇలియానా ఓ క్రేజీ టాలీవుడ్ హీరోని చిన్నచూపు చూసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఆ హీరోతో నటించేందుకు ఇలియానా అంగీకరించలేదు. 

లవర్ బాయ్ తరుణ్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం ప్రేమకథా చిత్రాలతోనే ఒకప్పుడు తరుణ్ టాలీవుడ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ హిట్ చిత్రాలు తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకువచ్చాయి. 

కానీ ఆ తర్వాత రోజుల్లో తరుణ్ కి వరుస పరాజయాల కారణంగా కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం తరుణ్ దాదాపు సినిమాలకు దూరంగా ఉన్నాడు. శ్రీయ, ఆర్తి అగర్వాల్ లాంటి అగ్ర హీరోయిన్లతో తరుణ్ నటించాడు. కానీ ఇలియానా మాత్రం తరుణ్ ని చిన్న చూపు చూసిన సంఘటనని నిర్మాత బెల్లంకొండ సురేష్ బయట పెట్టారు. 


ఇలియానా, తరుణ్ ఇద్దరూ భలే దొంగలు అనే చిత్రంలో నటించారు. అప్పటికే తరుణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ ఇలియానాని భలే దొంగలు చిత్రంలో నటించమని అడిగారట. హీరో ఎవరు అని అంటే.. తరుణ్ అని చెప్పారు. తరుణ్ అయితే నేను నటించను అని ఇలియానా చెప్పింది. ఆమె ఉద్దేశం నాకు తెలుసు. తరుణ్ ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి ఇలియానా తరుణ్ ని చిన్న చూపు చూసిందట. 

కానీ ఎలాగైనా ఇలియానాని ఈ చిత్రానికి ఒప్పించాలని బెల్లంకొండ సురేష్ అనుకున్నారు. పోకిరి హిట్ తర్వాత ఇలియానా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ అప్పటి వరకు తెలుగులో ఏ హీరోయిన్ కూడా కోటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీనితో ఈ చిత్రానికి ఒప్పుకుంటే కోటి రెమ్యునరేషన్ ఇస్తానని తాను ఇలియానాకి చెప్పినట్లు బెల్లకొండ సురేష్ అన్నారు. అంత డబ్బు ఆఫర్ చేస్తే ఎవరైనా టెంప్ట్ అవుతారు. 

దీనితో ఇలియానా కూడా వెంటనే ఒకే చెప్పింది అని సురేష్ తెలిపారు. ఆ విధంగా టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఇలియానాకి తాను కోటి పారితోషికం ఇచ్చినట్లు బెల్లకొండ తెలిపారు. 

Latest Videos

click me!