పుష్ప 2 దూకుడు : ఆ స్టార్ హీరోకు పెద్ద తలనొప్పిగా మారిందా?

Published : Dec 09, 2024, 08:22 AM IST

పుష్ప 2 హిందీ వెర్షన్ భారీ విజయం సాధించి, బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుండటంతో వరుణ్ ధావన్ 'బేబీ జాన్' చిత్రంపై ప్రభావం చూపుతుందని బాలీవుడ్ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

PREV
16
పుష్ప 2 దూకుడు : ఆ స్టార్  హీరోకు పెద్ద తలనొప్పిగా మారిందా?
pushpa 2


పుష్ప 2  ఈ స్దాయి సక్సెస్ ఊహించిందే అయినా నమ్మలేని విధంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ లో వస్తున్న కలెక్షన్స్  అభిమానులను, ట్రేడ్ విశ్లేషకులను, సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేస్తోంది.

అల్లు అర్జున్-నటించిన ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా హిస్టారికల్ నెంబర్స్ ను నమోదు చేస్తూనే ఉంది.  నాల్గవ రోజు, పుష్ప 2 మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు 82 కోట్ల రూపాయల నికర మొత్తాన్ని సేకరించి  హిస్టరీ క్రియేట్ చేసింది. 

26
Allu Arjun, #Pushpa2, sukumar

వీకెండ్ తో కలిపి  నాలుగు రోజుల థియేట్రికల్ రన్‌లో, పుష్ప 2: ది రూల్ హిందీ వెర్షన్ దాదాపు రూ. 290 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఇంతటి  భారీ ఫీట్‌ను అత్యంత వేగంగా సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. పుష్ప 2  హిందీ వెర్షన్ విజయం బాలీవుడ్  పెద్దలను షేక్ చేస్తోంది.నార్త్ ఇండియన్ సినీ లవర్స్ ..సినిమాని మన వాళ్ల కన్నా బాగా ఆస్వాదిస్తున్నారు. సుకుమార్ అక్కడి వాళ్లకు సరపడ దినుసులు తో ఈ సినిమాని వండి వడ్డించారు. 

36


ప్రపంచవ్యాప్తంగా, పుష్ప 2: రూల్ రాబోయే రోజుల్లో రూ. 1,000 కోట్ల క్లబ్‌లో కూల్ గా అడుగుపెట్టనుంది.  ఫుల్ రన్ కలెక్షన్ అందరి అంచనాలకు మించి ఉంటుంది.  అయితే ఇప్పుడు ఇదే కొందరికి సమస్యగా మారింది.

ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ థావన్ కు ఈ సినిమా పెద్ద ఇబ్బంది గా టర్న్ అయ్యింది. పుష్ప 2 చిత్రం అతని తాజా చిత్రం బేబి జాన్ కలెక్షన్స్ పై ఏ స్దాయి ఎఫెక్ట్ పడనుందా అనే టెన్షన్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది.
 

46
Allu Arjun, #Pushpa2, Sukumar


బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’. ఈ చిత్రాన్ని కలీస్ (Kalis)దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh), వరుణ్ సరసన నటిస్తుంది.

ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కామియో రోల్‌లో కనిపించబోతున్నాడు. దీనిని మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ(Priya Atlee), జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బేబీ జాన్’(Baby John) మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం త‌మిళ స్టార్ హీరో న‌టించిన తెరి మూవీకి రీమేక్‌.

56

పుష్ప 2 రెండు వారాల తర్వాత బేబీ జాన్ వస్తోంది.   పుష్ప 2 పెద్ద హిట్ అవటంతో థియేటర్లలలో తీసేసే అవకాసం లేదు. పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ వద్ద లెజెండరీ  సక్సెస్ సాధించబోతోంది. దాంతో సౌత్ ఇండియన్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం పుష్ప 2 తో  పోటీపడే అవకాశం లేదు. పుష్ప 2 స్కేల్ చాలా పెద్దది  కావటంతో  వరుణ్ ఇంకొంత టైమ్ తీసుకుని థియేటర్ లోకి దిగితే బాగుండేది అంటున్నారు.

 

66

ఇప్పుడు బేబి జాన్ గురించి మాట్లాడేవాళ్లే కనపడటం లేదు. అందరూ పుష్ప 2 మత్తులో ఉన్నారు. వరుణ్ థావన్ కు ఇది ఊహించని సమస్యే. అలాగని క్రిస్మస్ ని వదిలేస్తే నెక్ట్స్ ఎప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరుకుతుందో తెలియని పరిస్దితి. టెన్షన్ తో భాక్సాఫీస్ వంక , పుష్ప2 అంకెల వంక చూడాల్సిన పరిస్దితి. 

click me!

Recommended Stories