రానాకి చెబుతూ.. ఆమ్మో సాయి పల్లవితో నటించాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బావా అని నాగ చైతన్య కామెంట్స్ చేశాడు. ఆమె చాలా ట్యాలెంటెడ్, గ్రేట్ కోస్టార్ అంటూ నాగ చైతన్య ప్రశంసలు కురిపించాడు. నువ్వు మాత్రం ఆమెతో డ్యాన్స్ చేయకుండా విరాటపర్వం చిత్రంలో నటించి తప్పించుకున్నావ్ అంటూ రానాపై చైతు సెటైర్లు వేశాడు. చైతన్య, సాయి పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. సమంత కూడా హీరోలని డామినేట్ చేసే పెర్ఫామెన్స్ ఇస్తుంది. కానీ చైతు ఆమె పేరు చెప్పలేదు. చైతు, సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. రియల్ లైఫ్ లో మాత్రం ఈ జంట కలసి ఉండలేకపోయారు.