pushpa 2
"పుష్ప 2" క్రేజ్ ని చూసి ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు ఆశ్చర్యపోతున్నాయి. "పుష్ప: ది రైజ్" (Pushpa: The Rise) సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో, రెండో భాగం "పుష్ప 2: ది రూల్" మీద భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 కథలో పుష్పరాజ్ ఎలా కింగ్ అవుతాడు,
అతన్ని వ్యతిరేకించే వాళ్లతో ఎలా పోరాడతాడు, తన అన్న అజయ్ తో ఏ ఎమోషన్ ప్లే అవనుంది అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. ప్రేక్షకులు "తగ్గేదేలే" తరహా డైలాగ్స్ మరియు యాక్షన్ సీక్వెన్సులు కోసం ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ని ఓ బెట్టింగ్ యాప్ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.
పుష్ప 2 చిత్రానికి బుధవారం (డిసెంబర్ 4) అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ల కోసం తెగ వెతుకుతున్న అభిమానుల కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అతడు Wolf7Pay అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన ప్రమోషన్లో భాగంగా ఏకంగా పది వేల పుష్ప 2 టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించటం విశేషం.
పుష్ప 2 టిక్కెట్లు తాము అందుకోవటం కోసం ఏం చేయాలో కూడా అతడు ఓ ప్రత్యేకంగా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో అతడు పోస్ట్ చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప మూవీలోని డైలాగ్ తో ఆ వీడియోను ఏబీ మొదలుపెట్టాడు.
ఆ వీడియోలో ఏముంది అంటే... "అందరికీ హాయ్.. సినిమా లవర్స్ అందరి కోసం నేనో ఉత్సాహకరమైన వార్త తీసుకొచ్చాను. @Wolf7Payలో కనీసం రూ.100, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే తొలి 10 వేల మంది డిపాజిటర్లకు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పుష్ప 2 టికెట్లు అందుతాయి.
ఏమాత్రం వేచి చూడకండి. ఇది ఈ శనివారం (డిసెంబర్ 7)తో ముగుస్తుంది. బాధ్యతాయుతంగా ఆడి, కింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ప్లేస్ కన్ఫమ్ చేసుకోండి" అనే క్యాప్షన్ తో ఏబీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇక నైతికమా, అనైతికమా అనేది ప్రక్కన పెడితే పుష్ప 2 టికెట్లంటూ ఏబీ డివిలియర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. @Wolf7Pay ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పోర్టల్ ను ఎండార్స్ చేస్తున్నారు.
తాజాగా పుష్ప 2 మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ద్వారా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తుండటం విశేషం. గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కాబోతున్న ఈ పుష్ప 2 మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూండటమే అతనికి,అతని యాప్ కు ప్లస్ కాబోతోంది.