కేరళలలో 'పుష్ప2' కు ఆదరణ కరువు, కారణం ఇదేనా ?

Published : Dec 09, 2024, 09:56 AM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నప్పటికీ, కేరళలో మాత్రం ఊహించని విధంగా ఆదరణ లేకపోవడం గమనార్హం. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా లేకపోవడమే దీనికి కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
15
 కేరళలలో 'పుష్ప2' కు  ఆదరణ కరువు, కారణం ఇదేనా ?
Pushpa 2, allu arjun, Sukumar, Kerala


అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే ఊహించని విధంగా కేరళలో బన్నీ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది.  కేరళలో రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని అక్కడ ట్రేడ్ అంటోంది.

ఓ రకంగా ఇది నిర్మాతలకు,  అక్కడ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కు,  బన్ని కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా  కేరళల మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేసారు. అలాగే కేరళ ఆడియన్స్ కోసం చాలా ఏర్పాట్లు చేసారు. అక్కడ ఆడవాళ్లకు ప్రత్యేకమైన షోలు వేసారు. అయినా అక్కడ కేవలం యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది.   ఈ ట్రెండ్ వెనుక ఉన్న కారణాలపై అభిమానులు,  విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

25
a movie theatre in kochi screened pushpa second half without showing the first half allu arjun fahadh faasil


 పుష్ప 2  సినిమా రిలీజ్ కు ఉన్న హైప్‌ను పరిగణనలోకి తీసుకుంటే కలెక్షన్లు ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. ఈ సినిాలో హిట్ సాంగ్ ఫీలింగ్స్‌లో మలయాళ సాహిత్యాన్ని ప్లాన్ చేసి మరీ వినియోగించారు.   ఈ క్రమంలో ఈ చిత్రం ప్రారంభ రోజున అంచనా వేసిన  రూ. 10 కోట్ల మార్క్ లో ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ రోజు నాటికి, కలెక్షన్లు దాదాపు 50% పడిపోయాయి, ఇది కేరళలో పుష్ప 2  బాక్సాఫీస్ రన్ గురించి ఆందోళన కలిగించే విషయమే. వీకెండ్ లలో సోసోగా ఉంది. 

35

పుష్ప 2 చిత్రం నార్త్ ఆడియన్స్ కోసం కాస్త ఎక్కువగా, అలాగే  తెలుగు గ్రామీణ ప్రేక్షకుల కోసం రూపొందించబడిన మాస్-యాక్షన్ స్టైల్ ఫిల్మ్.  అయితే ఎప్పుడూ విభిన్నత కోరుకునే మళయాళి ప్రేక్షకులుకు ఈ సినిమా ఎక్కలేదు. ఫస్ట్ పార్ట్ ఉన్నంత ఆర్గానిక్ గా సెకండ్ పార్ట్ లేదంటన్నారు.

కేరళ సినీ ప్రేక్షకులు బలమైన కథనాలు, నేచురల్ గా ఉండే ట్రీట్‌మెంట్‌తో కూడిన చిత్రాలను ఇష్టపడతారు. అదే పుష్ప 2  వచ్చేసరికి హై ఇచ్చే ఎలిమెంట్స్, యాక్షన్  సీన్స్ కు ప్రయారిటీ ఇచ్చారు.  

45


అల్లు అర్జున్ కు కేరళ రాష్ట్రంలో స్ట్రాంగ్ గా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, పుష్ప 2 దాని మునుపటి విజయాన్నిరిపీట్ చేయడంలో విఫలమైంది, ఊహించిన దాని కంటే కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. ఫహద్ ఫాసిల్, మలయాళ సినిమాలో పాపులర్  నటుడు అయినా కలిసి రాలేదు.

ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాని ఇష్టపడటం లేదు. ఫహద్ ఫాజిల్  స్క్రీన్ టైమ్ లిమిటెడ్ గా ఉండటం, పెద్దగా ఇంపాక్ట్ చూపించని పాత్రలో కనిపించటం మళయాళీలను నిరాశపరిచింది. అంతేకాదు పుష్ప: ది రైజ్   ఫహద్  పాత్ర ముగింపు కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. అతను చనిపోవటం చాలా మందికి నచ్చలేదు. అతని నుంచి మరిన్ని స్ట్రాంగ్ సీన్స్ మళయాళీయలు ఆశించి ఉండవచ్చు.

55


నార్త్ లో మాత్రం ఈ సినిమా కుమ్మేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో హైప్ మధ్య రిలీజైన ఈ సినిమాకు ఇక్కడ మన సౌత్ లో ముఖ్యంలో తెలుగులో  మిక్స్డ్ టాక్, రివ్యూలు వచ్చాయి కానీ.. హిందీలో దుమ్ము దులుపుతోంది.

కేవలం నార్త్ ఇండియా అనే కాదు.. ఓవర్ సీస్ లో కూడా ‘పుష్ప-2’ భారీ వసూళ్లతో దూసుకెళ్తుండడం విశేషం. ముంబయిలో తొలి రోజే కాక తర్వాత కూడా అర్లీ మార్నింగ్, మిడ్ నైట్ షోలు ఫుల్స్‌తో నడవడం విశేషం.యూపీ, బీహార్ బెల్ట్ లలో ఈ సినిమా తాండవం చేస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories