పుష్ప 2: ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఫిగర్స్ షాకింగ్ ! !

First Published | Dec 2, 2024, 3:51 PM IST

పుష్ప 2: ది రూల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. అమెరికాలో ప్రీమియర్ షో కోసం 50,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఇండియాలో 35 కోట్ల గ్రాస్ వసూలు అయ్యింది. మొదటి రోజు వంద కోట్లకు పైగా టికెట్ సేల్స్ జరుగుతాయని అంచనా.

Allu Arjun, #Pushpa2, sukumar

ఇప్పుడు ట్రేడ్ దృష్టి మొత్తం పుష్ప 2 పైనే ఉంది. ఈ సినిమా లెక్కలు ఇండస్ట్రీకు కొలమానంగా మారే అవకాసం ఉందంటున్నారు. ఇప్పటికే పుష్ప 2: ది రూల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ భారీగా కొనసాగుతోంది. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో కోసం ఇప్పటికే 50,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. అలాగే పుష్ప 2 అడ్వాన్స్ బుక్కింగ్ గ్రాస్ ఇండియాలో ఇప్పటివరకూ 35 కోట్లు వరకూ జరిగిందని అంచనా. 


అలాగే తొలి రోజు  ఓవర్ సీస్, వరల్డ్ వైడ్ అడ్వాన్స్  నుంచి 30 కోట్లు గ్రాస్ వస్తుందని అంచనా. అంటే 65 కోట్లు ఇప్పటిదాకా అడ్వాన్స్ బుక్కింగ్స్ జరిగినట్లు. ఇంకా ఆంధ్రప్రదేశ్ టిక్కెట్ బుక్కింగ్ ఓపెన్ కాలేదు. అలాగే స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ఇంకా ఓపెన్ కాలేదు.

ఇవాళే అవి ఓపెన్ అవుతాయని అంచనా. దాంతో మొదటి వంద కోట్లకు తక్కువ కాకుండా టిక్కెట్ సేల్స్ జరుగుతాయని ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ తో కలిపి 150 కోట్లు దాకా మొదటి రోజు షోలతో వస్తుందని చెప్తున్నారు. కొంచెం అటూ ఇటూలో అదే అంకె ఉండే అవకాసం ఉంది.


Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

ఇప్పటివరకు ఇండియన్ సినిమాల ప్రీమియర్ కోసం అత్యంత వేగంగా జరిగిన రికార్డు. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు మిగిలి ఉండడంతో, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు (ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌).

దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది .  అలాగే ‘పుష్ప2’ ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల  వ్యూస్  పొందిన ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా నిలిచింది .

Allu Arjun, #Pushpa2, sukumar


పుష్ప 2 మునుపటి బ్లాక్‌బస్టర్ "పుష్ప: ది రైజ్"ను మించి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 నుంచి అల్లు అర్జున్ పుష్ప రూల్ మొదలైపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చేసింది. 
 

Allu Arjun, #Pushpa2, Sukumar


విదేశాల్లో దీని ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా యాభైవేల టికెట్స్ సేల్‌ అయిన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు నెలకొల్పింది  . అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. 
 

Latest Videos

click me!