Pushpa movie review: పుష్ప ట్విట్టర్ టాక్.. పోకిరి రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్!

First Published | Dec 17, 2021, 6:11 AM IST

అల్లు అర్జున్ (Allu Arjun)కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది పుష్ప. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా పుష్ప తెరకెక్కుతుండగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 


డిసెంబర్ 17న గ్రాండ్ గా పుష్ప విడుదల అవుతుంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శనలు జరిగాయి. దీనితో నెటిజెన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి పుష్ప (Pushpa Review)మూవీ హిట్ ఫట్టా అనేది వాళ్ళ మాటల్లో చూద్దాం.. 

పుష్ప (Pushpa)కథ విషయానికి వస్తే... చిన్నప్పటి నుండి అనాదరణకు గురైన పుష్ప రాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ లో అడుగుపెడతాడు. చెట్లు నరికే కూలీగా గ్యాంగ్ లో చేరిన పుష్ప తన తెగింపు, ధైర్యంతో తక్కువ కాలంలోనే మాఫియాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో కింగ్స్ గా ఉన్నవారికి తలనొప్పిగా మారి, వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. పుష్ప అసలు నేపథ్యం ఏమిటనేది క్లైమాక్స్ ట్విస్ట్.... 


సుకుమార్ సినిమాలలో పాత్రలు,వాటి నేపథ్యాలు చాలా బలంగా ఉంటాయి. ప్రతి పాత్ర కథలో కీలకంగా నడుస్తాయి. అయితే ఈ మూవీలో సుకుమార్ తన ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ రోల్ పైనే పెట్టారు. పుష్ప మూవీలో పుష్ప రాజ్ మాత్రమే కనిపిస్తాడు. తెరపై అల్లు అర్జున్ ని చూస్తున్న భావన కలగదు. అల్లు అర్జున్ మేనరిజం, చిత్తూరు డైలెక్ట్ అద్భుతమన్న అభిప్రాయం నెటిజెన్స్ వ్యక్తపరుస్తున్నారు. 

పుష్ప అల్లు అర్జున్ వన్ మాన్ షో అనేది ట్విట్టర్ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. అదే సమయంలో రష్మిక (Rashmika Mandanna)కు నెగిటివ్ మార్క్స్ వేస్తున్నారు. డీగ్లామర్ రోల్ లో ఆమె లుక్ నచ్చలేదంటున్నారు.  హీరోతో ఆమె లవ్ ట్రాక్ ఏమంతగా ఆకట్టుకోలేదట. నటన పరంగా పాజిటివ్ గా స్పందిస్తున్న ట్విట్టర్ పీపుల్, ఆమె లుక్ పట్ల పెదవి విరుస్తున్నారు. 

Pushpa Pre release event

పుష్ప మూవీలో ప్రధాన విలన్ మంగళం శ్రీనుగా సునీల్ నయా అవతారం మెప్పించింది. కమెడియన్ గా వందల సినిమాలు చేసిన సునీల్... ఓ సీరియస్ విలన్ రోల్ లో సహజంగా నటించారు. మాఫియా సిండికేట్ లో కీలక వ్యక్తిగా సునీల్ అరిపించాడనేది నెటిజెన్స్ ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక స్టార్ యాంకర్ అనసూయ ఆయన భార్య రోల్ చేస్తారు. ఆమె గెటప్, లుక్ చూసి కీలక రోల్ అనుకుంటే పొరపాటే, రంగస్థలం అంతలేదంటున్నారు. 

Anasuya Bharadwaj

రెడ్ శాండల్ మాఫియా కొండా రెడ్డి పాత్రలో అజయ్ ఘోష్ నటించినట్లు తెలుస్తుంది. ఇక స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ పాత్రకు అంత స్కోప్, స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవడం నిరాశపరిచే అంశమే. మొదట్నుండి పుష్ప మెయిన్ విలన్ గా ప్రచారమవుతున్న ఫహద్ ఫాజిల్ ఎంట్రీ చివర్లో ఉంటుంది. ఆయన పాత్ర గురించి ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అయితే ఆయనను సెకండ్ పార్ట్ కి పరిమితం చేశారేమో అనిపిస్తుంది. పార్ట్ 1లో ఫహద్ చివరి 30 నిముషాలు మాత్రమే కనిపిస్తారు. 

ఇక పుష్ప విషయంలో ప్రధానంగా చెప్పుకుంటున్న మరొక ప్లస్ పాయింట్ సమంత ఐటెం నంబర్. ఈ సాంగ్ లో సమంత గ్లామర్, ఊర మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పండగ అంటున్నారు. సినిమాకు మంచి ఊపుతెచ్చిన సాంగ్ గా సమంత ఐటెం నంబర్ పై అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 


మొత్తంగా పుష్పకు ట్విట్టర్ లో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ నటన , మేనరిజంతో పాటు యాక్షన్, క్రైమ్ సన్నివేశాలు సుకుమార్ తెరకెక్కించిన విధానం బాగుందంటున్నారు. అయితే సుకుమార్ రేంజ్ మూవీ కాదనేది కొందరి అభిప్రాయం. కథలో విషయంలో లేకుండా మూడు గంటలు సాగదీశారంటున్నారు. 
 

రొటీన్ కథను ఎటువంటి మలుపులు లేకుండా ఫ్లాట్ గా చెప్పడం వలన ఆసక్తికలిగించలేకపోయారనేది ప్రధానంగా వినిపిస్తున్న లోపం. హీరోయిన్ రష్మిక మందాన లుక్ కి నెగిటివ్ మార్క్స్ పడుతున్నాయి. పుష్ప క్లైమాక్స్ లో పోకిరి తరహా ట్విస్ట్ ఉన్నట్లు కొందరు ట్వీట్ చేస్తున్నారు. 
 

pushpa kerala release

రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ మేనరిజం, సమంత ఐటెం సాంగ్ సినిమాకు ఉన్న అనుకూల అంశాలనేది ట్వీపుల్స్ అభిప్రాయం. ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవారిలో ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి స్వయంగా సినిమా చూసి, అసలు విషయం తెలుసుకోవం బెటర్.. 

Also read Pushpa Movie: 'పుష్ప' ప్రీమియర్ షో టాక్.. ఫారెస్ట్ లో అల్లు అర్జున్ చెడుగుడు

Also read Pushpa First Review: పుష్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవ్వండి!

Latest Videos

click me!