షాక్ లో పూరీ, విజయ్ దేవరకొండ, సోషల్ మీడియాలో లీక్ అయిన లైగర్ స్టోరీ, ట్రైలర్ చూసి చెప్పేశారుగా..?

Published : Jul 22, 2022, 10:14 AM IST

సోషల్ మీడియాలో లైగర్ మూవీ రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇలా ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో భారీగా ఫ్యూస్, లైక్స్ తో పాటు అదే రేంజ్ లో మీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. పనిలో పనిగా లైగర్ సినిమా స్టోరీలైన్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ లైగర్ కథ ఏంటీ..? 

PREV
16
షాక్ లో పూరీ, విజయ్ దేవరకొండ, సోషల్ మీడియాలో లీక్ అయిన లైగర్ స్టోరీ, ట్రైలర్ చూసి చెప్పేశారుగా..?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈమూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది. ఇక ఈ ట్రైలర్ కు  మంచి ఫ్యూస్,లైక్స్ లో పాటు మీమ్స్, ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. లైగర్ కథ ఇది అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. 

26

లైగర్ సినిమా కథపై రకరకాలుగా పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. ట్రైలర్ చూసి కథ చెప్పేస్తున్నారు నెటిజన్లు. బాక్సింగ్ కింగ్  మైక్ టైసిన్ ఇండియా వచ్చినప్పుడు.. గైడ్ గా ఉన్న రమ్య కృష్ణను ప్రేమించి ప్రెగ్నెంట్ ను చేస్తాడని.. ఆతరువాత ఆయన వెళ్ళిపోతాడని. ఆతరువాత విజయ్ దేరకొండ పుట్టడం, మైక్ పై ఉన్న కోపంతో..విజయ్ ను  టైసన్ ను మించి బాక్సన్ ను చేయాలి అనుకుంటుంది.

36

రమ్యకృష్ణ  ఎంతో కష్టపడి విజయ్ ను బాక్సర్ ను చేస్తుంది. విజయ్ కూడా అంతే కష్టపడి తిండికి లేకున్నా.. ఏదో ఒక పనిచేసుకుంటూ  బాక్సర్ గామారుతాడు, ఒక సంరద్భంలో విజయ్ కు నిజం తెలిసి తండ్రిని వెతుకుతూ హాలీవుడ్ వెళ్ళడం, టైసన్ తో పోరాడి, ఆయన్ను మార్చి , ఆతరువాత క్లైమాక్స్ లో తల్లీ తండ్రులను కలపడంతో సినిమా ఎండ్ అవుతుంది అంటూ..  లైగర్ కథతో కూడిన పోస్ట్ నెట్టింట్ట హల్ చల్ చేస్తోంది. 

46

ఇవే కాదు లైగర్ సినిమాపై, ఈ సినిమా కథపై రకరకాల పోస్ట్ లు మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పూరీ జగన్నాథ్ గతంలో  రవితేజ హీరోగా, బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ తో .. అమ్మానాన్నా తమిళ్ అమ్మాయి సినిమా చేశాడు. ఈ అయితే ఆ సినిమా కథతో లైగర్  సినిమాను పోలుస్తూ కూడా ట్రోల్స్ ట్రెండ్ అయ్యాయి. 
 

56

ఇక లైగర్ సినిమా కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కావడంతో  భారీ అంచనాలు ఉన్నాయి మూవీపై. అందులోనూ విజయ్ కు ఫస్ట్ పాన్ఇండియా మూవీ కావడం, కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను డీల్ చేస్తుండటంతో లైగర్ దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. 
 

66

ఇక ఈసినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ లో విజయ్ దేవరకొండతో పాటు రమ్య కృష్ణ మాస్ డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తరువాత రమ్యకృష్ణలో మళ్లీ అదే ఫైర్ కనిపించే క్యారెక్టర్ ఇది. ఇక ఈసినిమా వచ్చే నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది.  

click me!

Recommended Stories