ఓ సినిమా సెన్సార్ పూర్తయ్యాక ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ అలీతో కామెడీ సీన్లు చిత్రీకరించారు. చివరికి ఆ సినిమా రిజల్ట్ ఏమైందో ఈ కథనంలో తెలుసుకోండి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన తొలి చిత్రం బద్రితోనే జైత్ర యాత్ర మొదలు పెట్టారు. ఇండియట్ మూవీతో టాలీవుడ్ పూరి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక పూరి జగన్నాద్ వెనుదిగిరి చూసుకోలేదు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేసి తిరుగులేని డైరెక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం పూరి హవా బాగా తగ్గింది.
25
మార్తాండ్ కె వెంకటేష్ కామెంట్స్
ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియట్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాకి సంబంధించిన మధురమైన జ్ఞాపకాన్ని రివీల్ చేశారు. ఇడియట్ సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కూడా కంప్లీట్. దీనితో ఇండస్ట్రీలో కొంతమందికి ప్రీవ్యూ షో ప్రదర్శించాం.
35
ఇడియట్ ప్రీవ్యూ షోకి షాకింగ్ రియాక్షన్
అందరూ సినిమా చూశారు బావుందని అంటున్నారు కానీ ఎవరి కళ్ళల్లో నిజాయతీగా ఆ సమాధానం వస్తున్నట్లు అనిపించలేదు. అందరూ డల్ గా ఆన్సర్ ఇస్తున్నారు. కొంతమందికి అడిగితే సినిమా మొత్తం ఒకే ధోరణిలో చాలా లౌడ్ గా వెళుతోంది అని చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది. దీనితో పూరి జగన్నాధ్ నన్ను, కో డైరెక్టర్ ని పిలిచి అడిగారు. ఏంటి అందరూ డల్ గాఉన్నారు అని అడిగారు.
అందరూ సినిమా లౌడ్ గా ఉంది అని అంటున్నారు సార్. నాక్కూడా అలాగే అనిపించింది అని చెప్పా. మంచి మంచి సీన్లు వస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ కి ఎక్కడా బ్రీతింగ్ స్పేస్ లేదు అని మేము భావించాం. రవితేజ వాయిస్ కూడా ఒక కారణం. అలా అయితే మనం మణిరత్నం స్టైల్ ఫాలో అవుదామా అని అన్నారు. అంటే ఏంటి సార్ అని అడిగా. సినిమాని మధ్యలో అక్కడక్కడా బ్రేక్ చేసి సంబంధం లేకుండా కొన్ని కామెడీ సీన్లు పెడదాం అని అన్నారు. మణిరత్నం సినిమాల్లో కామెడీ ఇలాగే ఉంటుంది.
55
అప్పటికప్పుడు అలీతో సీన్లు షూట్ చేసి..
దీనివల్ల జనాలు కాసేపు నవ్వుకుంటారు.. ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళతారు అని అన్నారు. సెన్సార్ అంతా పూర్తయ్యాక, ప్రివ్యూ షో కూడా పడ్డాక అప్పుడు అలీతో ఇసుక కామెడీ సీన్లు షూట్ చేశాం. అది చాలా బాగా వర్కౌట్ అయింది అని మార్తాండ్ కె వెంకటేష్ పేర్కొన్నారు. అదే ఫార్ములాని అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు చిత్రాల్లో కూడా ఉపయోగించినట్లు మార్తాండ్ కె వెంకటేష్ పేర్కొన్నారు.