టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రవితేజ, మహేష్ బాబు లాంటి హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు, 100కోట్లకు పైగా నష్టపోయిన స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆయన జీవితంలో ఏడ్చిన మొదటి సందర్భం ఏంటి? మళ్లీ కమ్ బ్యాక్ అవ్వడానికి ఏం చేశాడు?
టాలీవుడ్ లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన దర్శకుడు ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. హీరోలను స్టార్ హీరోలగా మార్చాడు, బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ.. టాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు. హీరోయిజానికి సరికొత్త నిర్వచనం చూపించాడు ఆ దర్శకుడు. అంతే కాదు సినిమాల విషయాంలో ఎన్నో ప్రయోగాలు చేసి దాదాపుగా 100 కోట్లకు పైగా నష్టపోయాడు కూడా. అయినా సరే ఏమాత్రం భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం సక్సెస్ కోసం మరో సారి ఎదురు చూస్తున్న ఆఆ డైరెక్టర్ ఎవరో కాదు పూరీ జగన్నాథ్. ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కు ఆదర్శంగా నిలిచిన పూరీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.
25
స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు
పూరీ జగన్నాథ్ స్టైల్ వేరుగ ఉంటుంది. హీరోలలో నెగెటీవ్ కోణాన్ని ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చూపించడంలో పూరీ మార్క్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అంతే కాదు చాలామంది హీరోలు స్టార్స్ అవ్వడంలో పూరీ సినిమాల పాత్ర ఎంతో ఉంది. మహేష్ బాబుకు పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరీ, రవితేజను ఇడియట్ సినిమాతో హీరోగా నిలబెట్టాడు. వరుసగా హిట్ సినిమాలు చేసిన ఈ దర్శకుడు, మధ్యలో కొన్ని డిజాస్టర్స్ కూడా ఫేస్ చేశాడు. నిర్మాతగా కొన్నిసిమాలు చేసి నష్టపోయిన పూరీ, పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు.
35
100 కోట్లు నష్టపోయిన డైరెక్టర్
టాలీవుడ్ కు ఎన్ని హిట్ సినిమాలు అందించాడో, అంతా నష్టపోయాడు పూరీ జగన్నాథ్. ఇండస్ట్రీలో మోసాలకు బలైన ఈ దర్శకుడు, కొన్ని సినిమాలు నిర్మించి నష్టాలు చూశాడు. కష్టాల్లో ఉన్నపూరీకోసం ఏ హీరో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. చాలా కాలం ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేసిన పూరీ జగన్నాథ్.. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కలకు ఫుడ్ కూడా పెట్టలేకపోయాడు. అందుకే వాటిని కొంత మందికి ఇచ్చేశాడు. తన కూతురిని హాస్టల్ లో జాయిన్ చేయించాడు. కోట్లవిలువైన సినిమాలను డైరెక్ట్ చేసిన పూరీ జగన్నాథ్ ఒకానొక దశలో లక్షరూపాయలు కూడా చేతిలో లేక ఇబ్బందిపడ్డాడు. ఈ విషయాలను పూరీ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
వరుస సినిమాలతో నష్టపోయిన పూరీ జగన్నాథ్ ఇక ఇండస్ట్రీనుంచి మాయమైనట్టే అనుకున్నారంతా? ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక, తనకు ఇష్టమైనవన్నీ కోల్పోయిన పూరీ..ఒక సందర్భంలో కన్నీరు కూడా పెట్టుకున్నారట. కానీ గుండెధైర్యం ఎక్కువగా ఉన్న ఈ దర్శకుడు, మళ్లీ తన ప్రస్థానం జీరోతో మొదలు పెట్టి.. చాలా తక్కువటైమ్ లోనే కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. రామ్ పోతినేనితో పూరీ చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరీ కి మళ్లీ ఇండస్ట్రీలో జీవం పోసింది. ఆతరువాత ఎదురైన ప్లాప్ ల సంగతి పక్కన పెడితే, పూరీ జగన్నాధ్ మాత్రం ఈసినిమాతో సాలిడ్ సక్సెస్ సాధించాడు.
55
పూరీ జగన్నాథ్ గురించి వినాయక్ కామెంట్స్
పూరీ జగన్నాథ్ కు ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రెండ్స్ ఉన్నారు. ఆయన్ను చాలా మంది జగన్ అనిపిలుస్తుంటారు. ఒక ఇంటర్వ్యూలో పూరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు డైరెక్టర్ వి.వి వినాయక్. వినాయక్ మాట్లాడుతూ.. '' జగన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలో నాకు నచ్చేది మనోధైర్యం. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన గజన్.. ఆతరువాత దాదాపు 100 కోట్లకుపైగా నష్టపోయాడు. అయినా సరే ఎక్కడా అతను ధైర్యాన్ని కోల్పోలేదు. నా పరిస్థితి ఇలా అయ్యిందని ఏమాత్రం ఆలోచించలేదు, ఎలా పైకి రావాలి అనేదే టార్గెట్ గా పెట్టుకుని పనిచేశాడు. ఎప్పుడు పనీ పనీ అంటాడు, కానీ దేని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అందుకే జగన్ అంటే నాకు చాలా ఇష్టం '' అని అన్నారు వినాయక్.