టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో లక్ష్మి ప్రణతి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె మీడియా ముందుకు రారు. సినిమా ఈవెంట్స్ కి హాజరుకారు. ఒక్కసారి కూడా లక్ష్మి ప్రణతి మీడియాతో మాట్లాడింది లేదు. అసలు లక్ష్మి ప్రణతి నేచర్ ఎలాంటిది? ఆమె ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలు ఎవరికీ తెలియదు.
మిగతా హీరోల భార్యలు లక్ష్మి ప్రణతికి చాలా భిన్నం. ఉపాసన, నమ్రత శిరోద్కర్, స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరి వృత్తి, వ్యాపకాలు, లైఫ్ స్టైల్ ఏమిటో మనకు తెలుసు. ఉపాసన బిజినెస్ ఉమన్. అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఇక నమ్రత విషయానికి వస్తే ఆమె ఒకప్పుడు హీరోయిన్. ప్రస్తుతం భర్త మహేష్ కి సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా కొనసాగుతున్నారు.
స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్. అందంగా కనిపించాలి అనుకుంటుంది. ప్రతి రోజూ వ్యాయామం, యోగా చేస్తుంది. అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి సోషల్ మీడియాకు దూరం. కాబట్టి ఆమెకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియదు. తాజాగా లక్ష్మి ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నె నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నార్నె నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయ్. ఈ మూవీ ప్రమోషన్స్ లో నితిన్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మి ప్రణతి ఎలాంటి వారో చెప్పాలని యాంకర్ అడిగింది. ఒక తమ్ముడిగా ఆమెతో నాకు క్రేజీ బాండింగ్ ఉంది. అక్క చాలా రిజర్వ్డ్. ఆమె ఎవరినీ కలరు. పెద్దగా మాట్లాడరు. మా మధ్య అయితే మంచి బాండింగ్ ఉంది.. అన్నాడు.
Lakshmi Pranathi
లక్ష్మి ప్రణతిని 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి పేరు అభిరామ్ కాగా, చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్. గతంతో పోల్చితే లక్ష్మి ప్రణతి బయట కనిపిస్తున్నారు. ఆ మధ్య అమెరికా ట్రిప్ లో లక్ష్మి ప్రణతి మోడ్రన్ డ్రెస్సుల్లో లో కనిపించి షాక్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్టీఆర్ 31 లాంచింగ్ ఈవెంట్ కి లక్ష్మి ప్రణతి హాజరయ్యారు. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. లక్ష్మి ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ గతంలో మ్యాడ్ మూవీలో నటించాడు. తాజాగా ఆయ్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో పలకరించనున్నాడు. ఆయ్ ఆగస్టు 15న విడుదల కానుంది..