తన తమ్ముడితో పూరి సినిమాలు చేయడం ఎందుకు మానేశారు.. ఆస్తుల ఎఫెక్ట్ పడిందా, సాయిరామ్ శంకర్ కామెంట్స్

First Published Mar 24, 2024, 9:24 PM IST

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం తడబడుతున్న మాట వాస్తవం. రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, రామ్, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి స్టార్స్ అందరికి పూరి జగన్నాధ్ సూపర్ హిట్స్ ఇచ్చారు.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం తడబడుతున్న మాట వాస్తవం. రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, రామ్, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి స్టార్స్ అందరికీ పూరి జగన్నాధ్ సూపర్ హిట్స్ ఇచ్చారు. తక్కువ టైం లో అద్భుతమైన క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమాలు చేయడం పూరి స్టైల్. అందుకే పూరి జగన్నాధ్ ని ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అంటుంటారు. 

ప్రస్తుతం పూరి జగన్నాధ్.. రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం చేస్తున్నారు. చివరగా తెరకెక్కించిన లైగర్ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. గతంలో పూరి జగన్నాధ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ ని కూడా హీరోగా నిలబెట్టాడు. అయితే ఆ తర్వాత సాయిరాం శంకర్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడంలో ఫెయిల్ అయ్యాడు. 

సాయిరాం శంకర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు 143, హలో ప్రేమిస్తారా, బంపర్ ఆఫర్ ఇలా అన్ని చిత్రాలు పూరి అండతో తెరకెక్కినవే. 143 చిత్రం నేరుగా పూరి దర్శకత్వంలో తెరకెక్కగా.. మిగిలిన చిత్రాలని పూరి నిర్మించారు. అయితే ఇటీవల పూరి తన తమ్ముడిని ఎందుకు పక్కన పెట్టేశారు అనే చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో సాయిరాం శంకర్ కి ఇదే ప్రశ్న ఎదురుకాగా అతడు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది. 

ప్రస్తుతం సమాజంలో తమ్ముడికి లక్ష రూపాయలు అవసరం అయితే నోట్ రాయించుకుని ఇచ్చే అన్నలు ఉన్నారు. కానీ మా అన్నయ్య నా కోసం మూడు చిత్రాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఒక అన్నలా కాకుండా ఆయన నా కోసం ఒక తండ్రిలా 143, హలో ప్రేమిస్తారా, బంపర్ ఆఫర్ లాంటి చిత్రాల్లో కోట్లాది రూపాయలు నా కోసం వెచ్చించారు. 

ఆ చిత్రాలతో నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నా జర్నీ నేను చేయాలి.. అది నా భాద్యత. చాలా మంది అంటుంటారు వెళ్లి మీ అన్నయ్యని అడగొచ్చు కదా అని. ఇలాంటి సమయంలో అన్నయ్య నాతో సినిమా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా బిజినెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పూరి జగన్నాధ్ సినిమా అంటే ఆయనకి తగ్గ హీరో కూడా ఉండాలి. రెమ్యునరేషన్ ఎంత తగ్గించుకున్నా 5 కోట్ల వరకు లాస్ ఉంటుంది. 

అనవసరంగా అలా ఎందుకు లాస్ కావడం. సరైన టైం వస్తే మా కాంబినేషన్ లో సినిమా వస్తుంది. అప్పటి వరకు నా జర్నీ నేను చేస్తాను. అదీ కాకుండా 6 ఏళ్ళ క్రితం అన్నయ్య ఆస్తులు పోయాయి. దీనితో అన్నయ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సాయిరామ్ శంకర్ తెలిపారు. సో ఇలాంటి టైం లో రిస్క్ చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు అనేలా సాయిరాం శంకర్ తెలిపారు. 

click me!