Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే

Published : Aug 28, 2026, 09:08 PM IST

ఆహాలో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆకలిరాజ్యం 2026 వెబ్‌సిరీస్‌లో నిరుద్యోగ యువత జీవితాలను వినోదం, భావోద్వేగాలతో చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

PREV
15
Aakali Rajyam 2026 Review

1980లో కమల్‌ హాసన్‌ నటించిన ఆకలిరాజ్యం నిరుద్యోగ యువత జీవితాలను తెరపైకి తీసుకొచ్చిన సినిమాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు అదే పేరుతో ఆకలిరాజ్యం 2026 వెబ్‌సిరీస్‌ వచ్చింది. ఆహా ఓటీటీలో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు యువత జీవితాలను ప్రధానంగా చూపించారు. ప్రస్తుతం మూడు ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూద్దాం.

25
కథ

రమేశ్‌ (వికాస్‌ వశిష్ఠ), అరుణ (గీతా సైనీ), అక్షయ్‌ (రాజేశ్‌ ఖన్నా) ఇంజినీరింగ్‌ చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగం దొరకకపోవడంతో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలు కూడా వీరిని వెంటాడుతుంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే తమకంటూ సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనలోనూ ఉంటారు. ఈ ముగ్గురి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, వాటి నుంచి బయటపడేందుకు వారు చేసే ప్రయత్నాల చుట్టూనే కథ సాగుతుంది.

35
విశ్లేషణ

నిరుద్యోగం, ఉద్యోగం కోసం యువత పడే కష్టాలు అనే అంశం ఇప్పటికీ సమాజానికి దగ్గరగా ఉండటంతో సిరీస్‌ కథనం ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రావడంతో కథ పరంగా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. దర్శకుడు నీలగిరి మామిళ్ల మాత్రం సీరియస్‌ అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి రెండు ఎపిసోడ్లలో కామెడీకి ప్రాధాన్యం ఇవ్వగా, మూడో ఎపిసోడ్‌లో ఎమోషన్స్ ని హైలైట్ చేశారు. ప్రస్తుతానికి విడుదలైన మూడు ఎపిసోడ్లు ఓ మోస్తరుగా ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని సన్నివేశాలను మరింత కుదించి ఉంటే కథనం వేగంగా సాగేది. అక్కడక్కడా వచ్చే డబుల్‌ మీనింగ్‌ సంభాషణలు కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. వచ్చే వారం విడుదల కానున్న ఎపిసోడ్లలో స్మార్ట్‌ ఫార్మింగ్‌ నేపథ్యంలో కథ పల్లె ప్రాంతానికి మారనుంది.

45
టెక్నికల్‌గా ఎలా ఉంది

హైదరాబాద్‌లోని సహజమైన లొకేషన్లను ఉపయోగించుకోవడం సిరీస్‌కు ప్లస్‌గా నిలిచింది. కథకు తగ్గట్టుగా సన్నివేశాలను రూపొందించారు. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 35 నిమిషాల నిడివితో ఉండటంతో పెద్దగా సాగదీసిన అనుభూతి కలగదు. ప్రధాన పాత్రల్లో వికాస్‌ వశిష్ఠ, రాజేశ్‌ ఖన్నా, గీతా సైనీ తమ పరిధిలో చక్కగా నటించారు. అయితే కథలో కొత్తదనం తక్కువగా ఉండటంతో వారి పాత్రలకు బలంగా గుర్తుండిపోయే సన్నివేశాలు పెద్దగా దక్కలేదు. కొన్ని చోట్ల కథను ముందుకు తీసుకెళ్లేందుకు సౌకర్యవంతమైన రీతిలో రాసిన సన్నివేశాలు కూడా కనిపిస్తాయి.

55
ఓవరాల్‌గా

ఆకలిరాజ్యం 2026లో ప్రధానంగా నిరుద్యోగ యువత ఎదుర్కొనే సమస్యలను వినోదం, భావోద్వేగాల మేళవింపుతో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు వచ్చిన మూడు ఎపిసోడ్లు టైంపాస్‌గా అనిపిస్తాయి. కథాంశం కొత్తది కాకపోయినా ప్రస్తుత తరానికి సంబంధించిన అంశాలు ఉండటం కలిసొచ్చే అంశం.

Read more Photos on
click me!

Recommended Stories