కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది అభిమానుల్లో, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం మిగిల్చాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ ప్రతిభని, సేవాతత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.