తెలుగు హీరోయిన్, బిగ్‌బాస్3 ఫేమ్ పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్ జరిగింది. చేతికి రింగ్ తొడుకున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. త్వరలో మ్యారేజ్‌చేసుకోబోతున్నట్టు చెప్పకనే చెప్పేసింది.
పునర్నవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ, `మొత్తానికి ఇది జరిగింది` అని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో తన చేయిని మరోచేయి పట్టుకుని ఉంది. అందులో పునర్నవి వేలికి రింగ్ తొడిగి ఉంది. అయితే తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరనేమాత్రం వెల్లడించలేదు.
అయితే తాను దాచిన వివరాలు వెల్లడించబోతున్నట్టు చెప్పింది. అభిమానులు ఆమెని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించగా, అందుకు స్పందించింది.
తన మ్యారేజ్‌కి సంబంధించిన వివరాలు రేపు(అక్టోబర్ 30) శుక్రవారం వెల్లడించనున్నట్టు తెలిపింది. అప్పటి వరకు వెయిట్ చేయమంటోందీ తెలుగు హీరోయిన్.
ఉన్నట్టుండి తనకి ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయాన్ని వెల్లడించిన అభిమానులను షాక్‌కి గురి చేసింది పునర్నవి. బుధవారం రాత్రి ఆమె పెట్టిన పోస్ట్ తో అభిమానులు,నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు.
కొందరు కాంగ్రాట్స్ చెప్పగా, మరికొందరు `నిజమేనా మేడమ్..`, `ఇది నిజంగానే ఎంగేజ్‌మెంట్ రింగేనా?`, `వర్క్ ప్రమోషన్ చేస్తున్నారా?` ఇంతకీ ఎవరు మిమ్మల్ని మ్యారేజ్‌చేసుకోబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు? అంటూ ప్రశ్నించారు.
మరో నెటిజన్ స్పందిస్తూ, కంగ్రాట్స్. ఈ ఫోటోలో మీ చేయి పట్టుకుంది ఓ అమ్మాయి అని అనుకుంటున్నా` అని కామెంట్ పెట్టగా, `సైలెంట్‌గా ఉండు` అని ఎమోజీలతో రిప్లైఇచ్చింది పునర్నవి. దీంతో నిజంగానే ఆమెకి ఎంగేజ్‌మెంట్ జరిగిందా? అన్నది ప్రశ్న తలెత్తుతుంది.
మరో మహిళా నెటిజన్, పునర్నవి స్నేహితురాలు స్పందిస్తూ `ఓ మై గాడ్.. నువ్వు నిజమే చెబుతున్నావా? ఎట్టకేలకు సీక్రెట్ బయటపెట్టావు. ఇంకొంచెం ఎక్కువ చెప్పు` అనికామెంట్ చేయగా, `అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయి` అని పునర్నవి తెలిపింది.
దీంతో రేపు శుక్రవారం పునర్నవి ఏం చెప్పబోతుంది, తాను చేసుకోబోయే వాడి వివరాలు చెబుతుందా? అని వెయ్యి కళ్లతో ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు తాను చేసుకోబోయే వాడి గురించి తెలుసుకునేందుకు తమదైన స్టయిల్‌లో సెర్చింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు. మరి ఈ లోపు పట్టేస్తారేమో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పునర్నవి భూపాలం 1996 మే 28న తెనాలిలో జన్మించారు. సైకాలజీ, జర్నలిజంలో గ్రాడ్యూయేట్ చేశారు.
చిన్నప్పటి నుంచి ఆమెకి సినిమాలంటే ఇష్టం. నటిని కావాలని బలంగా కోరుకుంది. అలాడసినిమాలపై ఆసక్తితో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
2013లో `ఉయ్యాలా జంపాలా` చిత్రంలో ఓ కీలక పాత్రతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా మెప్పించింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది.
అల్లరిగా, చలాకీగా, చురుకుగా ఉండే పునర్నవి తొందరగానే అందరి దృష్టిని ఆకర్షించింది. పలు కామెంట్లతోనూ పాపులర్ అయ్యింది. `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` చిత్రంలోహీరోయిన్ నిత్యా మీనన్‌కి ఫ్రెండ్‌గా మెప్పించింది.
ఇలా పునర్నవి `ఉయ్యాలా జంపాలా`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`, `పిట్టగోడ`, `మనసుకు నచ్చింది`, `ఎందుకు ఏమో`, `ఒక చిన్న విరామం`, `సైకిల్` చిత్రాల్లో నటించింది.
సినిమాలతోపాటు టీవీ షోస్‌లోనూ మెరిసింది. గతేడాది ప్రసారం అయిన `బిగ్‌బాస్3`లో పాల్గొంది. దీనికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
దీంతోపాటు `ఆలీతో సరదాగా`, `2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి`లో గెస్ట్ గా పాల్గొంది.
ఇదిలా ఉంటే `బిగ్‌బాస్3` టైమ్‌లో పునర్నవికి, ఈ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మధ్య లవ్ ట్రాక్ జరిగింది. వీరిద్దరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కలిసితిరిగారు. దీంతో త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు.
ఇప్పుడు పునర్నవి ఏకంగా తన పెళ్ళిని ప్రకటించేసింది. మరి వరుడు ఎవరు? ఆమె ఎవర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.