‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

First Published | Oct 29, 2020, 2:10 PM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు. కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఆమె తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాను అంటోంది. ఈ విషయాలు ఆమె మీడియాతో మాట్లాడింది.  సింగిల్ సీరియల్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వంటలక్క ఇప్పుడు మరో కొత్త రోల్ లో కనిపించబోతున్నా అని చెప్పింది. దసరాపండుగ సందర్భంగా సాక్షి న్యూస్ ఛానల్ నిర్వహించిన  సుమ దీపం స్పెషల్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఎన్నో ప్రశ్నలకు..  వంటలక్క(ప్రేమీ విశ్వనాథ్) చాలా ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దాం.

మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు మాతృక. కరుతముత్తులో ప్రేమి కారక్టర్ పేరు కార్తీక అలియాస్ కార్తు అదే పేరుతో అక్కడ చాలా ఫేమస్ అయ్యింది.
2017లో తెలుగులో ప్రారంభమైన కార్తీక దీపంలో కూడా ప్రేమి విశ్వనాథ్ నట విశ్వరూపం ప్రదర్శించింది. వంటలక్కగా ప్రతీ తెలుగు ఇంటిని పలకరించింది.ఈ సీరియల్ దేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టింది.

మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కూడా లేకపోవడం విశేషం.. ఈ సీరియల్ తర్వాత ఎన్ని వచ్చినప్పటికీ అవేమీ ఈ సీరియల్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ టిఆర్పి రేటింగ్ లో మాత్రం కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.
అంతెందుకు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరుపొందిన బిగ్ బాస్ కూడా టీఆర్పీ విషయంలో ఈ సీరియల్ తో పోటీ పడలేకపోతుందంటే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘మళయాళం సీరీయల్ కారుముత్తులో మొదటిగా నాకు ఛాన్స్ వచ్చింది.. అదెలా అంటే.. మూడు ఏళ్లు లీగల్ ఎడ్వైజర్‌గా పని చేసిన తర్వాత కార్తుమత్తులోకి ఎంటర్ అయ్యాను.. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంకుల్.. చెప్పారు ఆడిషన్స్ జరుగుతున్నాయి వెళ్లు అని.
నిజానికి వైట్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలకు బ్లాక్ కలర్ వేసే సరికి అంతగా సెట్ కావట్లేదు.. ఒకసారి నువ్వు వెళ్లు అని ఆయన చెబితే.. సరేనని వెళ్లాను.. మొదట వెళ్లగానే డైరెక్టర్.. ఒరిజినాలిటీ కోసం చీపురి ఇచ్చారు.. ఇంట్లో ఎలాగో మనకి క్లీనింగ్ అలవాటు ఉంటుంది కదా.. తుడిచేశాను.
తర్వాత మేకప్ వేసి స్క్రీన్ టెస్ట్ చేశారు. తర్వాత చీర కట్టించి, ఒక డైలాగ్ ఇచ్చారు. అదో ఏడుపు సీన్. టెంపుల్‌కి వెళ్తుంటే గొడుగుతో వాళ్లకి అడ్డుగా ఉన్నానని తిడుతుంటారు.. నిజానికి ఆ తిట్లు విని నాకు నిజంగానే ఏడుపు వచ్చి ఏడ్చేశాను.. దాంతో సెలెక్ట్ చేసేశారు.
ఇది తెలుగు ఛానల్ కాబట్టి మళయాళం వాళ్లకి రాదు కాబట్టి ఈ సీక్రేట్ చెప్పేస్తున్నాను’ అంటూ పక్కున నవ్వేసింది ప్రేమీ. మరి తెలుగులో అవకాసం రావటానికి కారణం మళయాళ సీరియల్ హిట్టవటమే.
నిజానికి నలుపు రంగు అంటే అదో ఛాలెంజ్ . అందరూ అందంగా, తెల్లగా కనిపించాలనే అనుకుంటారు. నేను మాత్రం నలుపు రంగుతో పరిచయం అయ్యాను.. ఈ నలుపు రంగుతో పోటీగా నిలబడాలంటే చాలా కష్టం. అందుకే నేను ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడ్డాను.
నిజానికి నాకు నటన, మోడలింగ్ ఇవేమీ తెలియవు మొదట్లో.. నా బ్రదర్ ఓ ఫోటో గ్రాఫర్.. ప్రతిసారీ మొదట టెస్ట్ నా మీదే చేస్తాడు. నన్నే ఫోటోస్ తీసేవాడు. ఒకసారి నేను సారీలో రెడీ అయి ఉంటే ఓ ఫోటో తీశాడు. ఆ ఫోటోనే కారుముత్తుకి అవకాశం కలిపించింది.
‘నిజానికి దీప క్యారెక్టర్‌కి.. రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్‌కి అస్సలు సంబంధం ఉండదు.. నేను అస్సలు దీపలా ఉండను బయట ఫైటర్‌ని నేను.. రియల్ లైఫ్‌లో నేను చాలా పవర్ ఫుల్ ఉమెన్‌ని..
అబ్బాయిల్ని కొట్టాను కూడా.. రోడ్లో, షాపింగ్ మాల్స్‌లో తెలియకుండా చెయ్యి తగిలిందని చెయ్యి వెయ్యడం లాంటివి జరిగినప్పుడు వాళ్లని కొట్టాను కూడా.. నాకు తెలుసు కదా వాళ్లు ఏ ఉద్దేశంతో అలా అంటారో.. అందుకే తెలిసి కొడతాను వాళ్లని’ అంటూ చెప్పింది ప్రేమీ.
‘ప్రెజెంట్ అంతా మూవిస్ మీదే ఫోకస్ పెట్టాను. తెలుగు మూవీలోకి లీడ్ రోల్ రాబోతున్నాను.. ముందే స్టార్ట్ చెయ్యాల్సింది కానీ కరోనాతో ఆగిపోయింది..
హీరియిన్ ఓరియంటెడ్ సినిమా అది. అందులో నా క్యారెక్టర్ పోలీస్ ఆషీసర్. వెరీ పవర్ ఫుల్ లేడీగా కనిపించబోతున్నాను అని తెేల్చింది. అంటే ఆ సినిమా మళయాళ,తెలుగులో రూపొందనుందన్నమాట.
ఇక నాకొక బాబు. కేరళాలో అమ్మ దగ్గర ఉంటాడు. మావారు వినిత్ అయితే నాకంటే బిజీ... ఇంట్లో కూర్చుని నేనేం చెయ్యాలి.. అందుకే నేనూ బిజీ అయిపోయాను.
నేను మా వారు ఎప్పుడో ఒకసారి కలుస్తాం.. నేను హైదరాబాద్‌లో ఉంటే ఆయన కేరళాలో ఉంటారు... నేను కేరళాలో ఉంటే ఆయన వేరే ఊరులో ఉంటారు. మాది లవ్ మ్యారేజ్.. మొదట గుడిలో కలిశాం..’ అంటూ చెప్పుకొచ్చింది మన వంటలక్క.
ఇక ఈ సీరియల్ టైమింగ్ కి ఐపీఎల్ టైమింగ్స్ కి మధ్య క్లాష్ వస్తుందని ఐపీఎల్ టైమింగ్ మార్చాలని ఓ అభిమాని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ట్వీట్ కూడా చేశాడు.
ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాధ్ కి బయట హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనకు మామూలు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.
కేవలం సింగిల్ హ్యాండ్ తోనే సీరియల్ ని టాప్ లో నడిపిస్తుంది ఆమె.. ఇక ఇదిలా ఉంటే ఈ వంటలక్కకి ఏకంగా మెయిన్ లీడ్ లో సినిమా ఛాన్స్ వచ్చింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది . త్వరలోనే ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట.. దీనితో వంటలక్క ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 869 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 870 ఎపిసోడ్‌కి నేడు(అక్టోబర్ 29)న ఎంటర్ అయ్యింది.
అప్పట్లో ‘అంతరంగాలు', ‘ఎండమావులు' మొన్నామధ్య ‘చక్రవాకం', ‘మొగలిరేకులు' వంటి సీరియల్స్ చాలా కాలం పాటు విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలోకి వచ్చి చేరింది ‘కార్తీక దీపం'.
ఇందులో హీరో అయిన డాక్టర్ బాబు.. దీప అలియాస్ వంటలక్కను వివాహం చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలు పిల్లలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.
దాదాపు మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది ‘కార్తీక దీపం' సీరియల్. మొదటి నుంచీ ప్రేక్షకాదరణ పొందిన దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది.
ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు.
‘కార్తీక దీపం' ముందు బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే రేంజ్‌లో కొనసాగుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.
‘కార్తీక దీపం' తర్వాత ప్రసారమయ్య ‘ఇంటింటి గృహలక్ష్మి' కూడా బాగా క్లిక్కైంది. సీనియర్ సినీ హీరోయిన్ కస్తూరి లీడ్ రోల్ చేస్తున్న ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ సాధిస్తోంది.

Latest Videos

click me!