పల్సర్ బైక్ సింగర్ రమణ తన భార్య వల్ల ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలుసా.. ఓపెన్ కామెంట్స్ వైరల్

First Published | Jan 24, 2024, 11:21 AM IST

జానపద కళాకారుడు సింగర్ రమణ గురించి తెలియని వారుండరు. పల్సర్ బైక్, చింపిరి జుట్టు దానా లాంటి హుషారైన పాటలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

జానపద కళాకారుడు సింగర్ రమణ గురించి తెలియని వారుండరు. పల్సర్ బైక్, చింపిరి జుట్టు దానా లాంటి హుషారైన పాటలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పల్సర్ బైక్ సాంగ్ ఎంతలా పాపులర్ అయింది అంటే ధమాకా చిత్రంలో దానిని ఒక స్పెషల్ సాంగ్ లాగా పెట్టేసారు. దీనితో రమణ క్రేజ్ మరింతగా పెరిగింది. 

ప్రస్తుతం రమణకి అనేక వేదికలపై పెర్ఫామ్ చేసే అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెరపై షోలలో రమణ పలుమార్లు కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలో అలరిస్తున్నాడు. అయితే కొత్త సంవత్సరంలో అతడు ఓ ఇంటివాడయ్యాడు. జనవరి 3న కుందన అనే అమ్మాయిని రమణ వివాహం చేసుకున్నాడు. 


త్వరలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరూ జంటగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది. గతంలో రమణకి లవ్ విషయంలో ఒక బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో రమణ డిప్రెషన్ లోకి వెళ్ళాడు, బేబీ చిత్రం తరహాలో అతడి లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట. 

అయితే ఆ బాధని పక్కన పెట్టేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రమణ భార్య కుందన శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వల్ల తన కుటుంబ సభ్యుల వల్ల రమణ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని ఎమోషనల్ గా కుందన తెలిపింది. 

కుందన మాట్లాడుతూ.. మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమకి ఒప్పుకోలేదు. తాను ఆర్టిస్ట్ కాబట్టి నా ఫ్యామిలీ వద్దు అన్నారు. అవమానకరంగా రమణని ఎన్నో మాటలు అడిగారు. నా ఫ్యామిలీ అడిగిన మాటలకు ఇంకొకరు అయి ఉంటే పెళ్లి, ప్రేమ వద్దని డ్రాప్ అయ్యేవాళ్ళు. కానీ రమణ ఆ అవమానాలన్నీ దిగమింగాడు. 

నన్ను కూడా చాలా భరించారు. అందుకు ఆయనకి రుణపడిఉంటా.. ఐ లవ్ యూ అంటూ వేదికపై కుందన ఓపెన్ కామెంట్స్ చేసింది. భార్య మాటలకూ రమణ ఎమోషనల్ అయ్యాడు. ఆమెని ప్రేమగా హగ్ చేసుకున్నాడు. 

Latest Videos

click me!