ప్రభాస్‌, విజయ్‌ ఈ సమ్మర్‌ అంతా వీళ్లదే.. కొడితే మాత్రం రికార్డులన్నీ బద్దలే..

Published : Jan 24, 2024, 11:11 AM ISTUpdated : Jan 24, 2024, 04:25 PM IST

ప్రభాస్‌ `సలార్‌`తో దుమ్ములేపాడు. ఇప్పుడు సమ్మర్‌కి రాబోతున్నాడు. సింగిల్‌గా ఆయన బాక్సాఫీసు పంజా విసరబోతున్నాడు. కొడితే మాత్రం రికార్డులన్నీ బద్దలవడం ఖాయం.   

PREV
16
ప్రభాస్‌, విజయ్‌ ఈ సమ్మర్‌ అంతా వీళ్లదే.. కొడితే మాత్రం రికార్డులన్నీ బద్దలే..

టాలీవుడ్‌లో గతేడాది సమ్మర్‌కి ఏదీ పెద్ద సినిమా రాలేదు. యంగ్‌ హీరోల సినిమాలే వచ్చాయి. అందులో `దసర, `విరూపాక్ష` మాత్రమే ఆడాయి. సమ్మర్‌ మొత్తాన్ని వృథాగా వదిలేశారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది. విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ మాత్రమే రాబోతున్నారు. ఈ ఇద్దరికి పండగే. అయితే విజయ్‌ది లోకల్‌ మూవీ. కానీ ప్రభాస్‌ ది పాన్‌ ఇండియా, ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఉన్న మూవీ. దీంతో ప్రభాస్‌కి పండగే అని చెప్పొచ్చు.  
 

26

 ఈ ఏడాది సమ్మర్‌కి మరే పెద్ద హీరో రావడం లేదు. ముందుగా `దేవర`వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ పోస్ట్ పోన్‌ అయ్యింది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఇది ఆగస్ట్ కి వెళ్లిపోతుందని సమాచారం. అధికారిక ప్రకటన లేదుగానీ, ఆల్మోస్ట్ అదే కన్ఫమ్‌ అని చిత్ర వర్గాల సమాచారం. దీంతో సమ్మర్‌ ఖాళీ అయిపోయింది. మిగిలిన ఏ హీరో సినిమా సమ్మర్‌కి రావడం లేదు. 

36
familystar

మొదట రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` వస్తుందని భావించారు. కానీ ఆ మూవీ కూడా లేట్‌ అవుతుందని ఇటీవల దిల్‌రాజు చెప్పారు. సెప్టెంబర్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు. అంటే ఈ వేసవి కాలం టాప్‌ స్టార్స్ లో మరే హీరో మూవీ రావడం లేదు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, బన్నీ, గోపీచంద్‌ మూవీస్‌ కూడా సమ్మర్‌కి ప్లానింగ్‌ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్‌ పాగా వేస్తున్నాడు. ఏప్రిల్‌ 5న వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. `ఫ్యామిలీ స్టార్‌`ని అదే డేట్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమా బాగుంటే ఏప్రిల్‌ మొత్తం విజయ్‌ దే అని చెప్పొచ్చు. 

46

ఇక మే తొమ్మిదిన ప్రభాస్‌ నటించిన `కల్కి2898ఏడీ` రాబోతుంది. నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతుంది. ఇందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీలతోపాటు గెస్ట్ రోల్స్ లో విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి కాస్టింగ్‌ యాడ్‌ అయ్యింది. దీంతో ఈ మూవీ రేంజ్‌ మరింతగా పెరిగింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకు రానటువంటి కంటెంట్‌తో వస్తుంది. నాగ్‌ అశ్విన్‌ రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. 

56

ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. భవిష్యత్‌ కాలానికి సంబంధించిన కథతో సైన్స్ ఫిక్షన్‌గా ఇది రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఏమాత్రం బాగున్నా రికార్డులు బ్రేక్‌ అవడం ఖాయం. ఎందుకంటే గట్టి పోటీ మధ్య వచ్చిన `సలార్‌` ఏడు వందల కోట్లు చేసింది. ప్రభాస్‌ రేంజ్‌ ఏంటో చూపించింది. అదే ఊపులో ఇప్పుడు `కల్కి` వస్తుంది.ఈ సినిమా బాగుంది, కంటెంట్‌ ఆడియెన్స్ కి అర్థమైతే మాత్రం ఈ మూవీని ఆపడం ఎవరి తరం కాదు. దీనికి నార్త్ లో కూడా అడ్డంకి లేదు. అక్షయ్‌ `బడే మియా చోటా మియా` అనే, అజయ్‌ దేవగన్‌ `మైదాన్‌` సైతం ముందే విడుదలవుతున్నాయి. దీంతో అక్కడ కూడా అడ్డులేదు. 

66

పైగా మేలో మరే పెద్ద సినిమా ఇప్పటి వరకు అయితే లేదు. మే, జూన్‌ మొత్తం ఫ్రీ. `కల్కి` బాగుంటే రెండు నెలలు ఆడుతుంది. సినిమా రేంజ్‌కి, ఇంతటి ఫ్రీ స్పేస్‌కి ఇండియన్‌ బాక్సాఫీసు షేక్‌ అయిపోవడం, పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు ట్రేడ్‌ వర్గాలు. ఓ రకంగా ఈ సమ్మర్‌ మొత్తం అటు ప్రభాస్‌ ది, ఇటు విజయ్‌ది కాబోతుంది. ఎందుకంటే ఓ వైపు `ఫ్యామిలీ స్టార్‌`తో ఆయన సందడి చేయనున్నారు, మరోవైపు `కల్కి`లోనూ ఆయన భాగమయ్యారు. అలా ఈ ఇద్దరు ఈ సమ్మర్‌ని ఏలబోతున్నారని చెప్పొచ్చు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories