ధనుష్,విశాల్ సహా నలుగురు తమిళ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నిర్మాతల మండలి

నలుగు తమిళ స్టార్ హీరోలకు షాక్ తగిలింది. వారికి తమిళ చిత్ర నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. ఈ స్టార్స్ కు రెడ్ కార్డ్ ను జారీ చేసింది. 

producers who shocked tamil star heroes Dhanush vishal red card for those four JMS

తమిళఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలకు బిగ్ షాక్‌ ఇచ్చింది నిర్మాతల మండలి. నలుగురు హీరోలకు రెడ్‌ కార్డు జారీకి రెడీ అయ్యింది. అది కూడాచిన్న చితకా హీరోలు కాదు.. స్టార్ హీరోలు అయిన ధనుష్, విశాల్, శింబు, అథర్వ మురళీకు.. రెడ్‌కార్డు జారీ చేయాలని నిన్న జరిగిన  సర్వసభ్య సమావేశంలో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయం సంచలనంగా మారింది. 
 

producers who shocked tamil star heroes Dhanush vishal red card for those four JMS
vishal

నిర్మాతల మండలి అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో విశాల్‌ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  విశాల్ కు ఆయనకు రెడ్‌ కార్డ్‌ జారీ చేశారని చెబుతున్నారు. విశాల్ పై ఇండస్ట్రీలో ఎ్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి. తాజగా విశాల్ కూడా సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ రెడ్ కార్డ్ విషయంలో విశాల్ సినిమాలపై గట్టిగా ప్రభావం పడనుంది. 


2021లో నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌, శింబు మధ్య వివాదం తలెత్తింది. సినిమాకు అరవై రోజుల డేట్స్‌ ఇచ్చిన  శింబు కేవలం 27 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాడని, దాంతో తాను భారీగా నష్టపోయానని నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ రెండేళ్ల క్రితం పోలీసులను ఆశ్రయించారు. రాయప్పన్ కంప్లైయింట్  నేపథ్యంలో శింబుపై రెడ్‌ కార్డ్‌ ఇష్యూ చేశారని  సమాచారం. 

Dhanush 50

అయితే మరో సంచలన విషయం ఏంటంటే.. తమిళ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు.. కోలీవుడ్ అ అగ్ర హీరో ధనుష్‌ కు కూడా ఇందులో భాగంగా రెడ్ కార్డ్ జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ధనుష్ తెనండాల్‌ అనే నిర్మాణ సంస్థలో ఓ సినిమా అంగీకరించి, షూటింగ్‌ మొత్తం పూర్తి చేయకుండానే మధ్యలో సినిమాను వదిలేసి వెళ్లాడని నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది.
 

ATHARVAA

దాంతో ధనుష్ కు కూడా రెడ్ కార్డ్ జారీ చేయబోతున్నట్టు తమిళనాట సంచలన వార్త వైరల్ అవుతోంది. ఇక వీరితో పాటు యంగ్ హీరో  అథర్వ మురళికి  సైతం రెడ్  కార్డ్ ను నిర్మాతల మండలి జారీ చేసిందంట. దీనికి కారణం అదర్వ మురళీ.. మదియలకన్‌ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న సినిమాకు అంగీకరించి షూటింగ్‌ విషయంలో నిర్లక్ష్యంగా  వ్యవహరించాడ ఆరోపణలు వచ్చాయి. 

దాంతో అదర్వ మురళీకి కూడా రెడ్ కార్డ్ జారీ చేవారట నిర్మాతలు. ఇక  గతంలో కూడా  ఇదే తరహాలో పలువురు అగ్ర నటులపై రెడ్‌ కార్డ్‌ జారీ కావడంతో కొన్ని సంవత్సరాల పాటు వారు  సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో  ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. స్టార్ హీరోలు సినిమాలకు దూరం అయితే ఏంటి పరిస్థితి అంటూ.. ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!