ఇండస్ట్రీపై మీడియా దాడి.. సంచలనంగా మారిన ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ లెటర్‌

First Published Sep 5, 2020, 8:32 AM IST

ఇండస్ట్రీని భయానకంగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా ఇండస్ట్రీని దారుణంగా టార్గెట్ చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ కల్చర్‌ బాలేదని, క్రిమినల్ యాక్టివిటీస్‌ జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియా తమ వ్యూయర్‌ షిప్‌పు పెంచుకునేందుకు ఇండస్ట్రీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. కానీ అవేవి నిజం కాదు లేకలో పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగిస్తున్నాయి. ఈ యంగ్ హీరో మరణం తరువాత ఎక్కువగా ఇండస్ట్రీలోని మాఫియా, నెపోటిజంపై ప్రధానంగా చర్చ జరిగింది. కంగనా రనౌత్‌ లాంటి వారు ఇండస్ట్రీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు అధికారిక చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఓ ఓపెన్‌ లెటర్‌ను రిలీజ్ చేశారు.
undefined
ఇండస్ట్రీని భయానకంగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా ఇండస్ట్రీని దారుణంగా టార్గెట్ చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ కల్చర్‌ బాలేదని, క్రిమినల్ యాక్టివిటీస్‌ జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియా తమ వ్యూయర్‌ షిప్‌పు పెంచుకునేందుకు ఇండస్ట్రీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. కానీ అవేవి నిజం కాదు లేకలో పేర్కొన్నారు.
undefined
`మిగతా అన్ని ఇండస్ట్రీలలో ఉన్నట్టుగానే సినీ రంగంలో ఉన్న కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సినీ రంగం కూడా మిగతా అన్ని రంగాల్లాగే వాటిని సరిదిద్దుకొని సరికొత్తగా నిలబడుతుంది. ఒకరిద్దరి కారణంగా జరిగిన పొరపాట్లను ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించటం కరెక్ట్ కాదు. సినీ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందికి అవకాశం కల్పిస్తోంది. ఈ రంగం కారణంగా ట్రావెల్, టూరిజం కూడా పెరుగుతుంది. సినిమా ఎన్నో ఏళ్లుగా కోటాను కోట్ల మందిని అలరిస్తోంది.
undefined
ఈ రంగం ప్రపంచ వ్యాప్తంగా సాహిత్య, కళా, సంగీత రంగాలకు సంబంధించిన ఎంతో మంది అవకాశాలు కల్పించింది. దేశానికి అవసరమైనప్పుడు తనవంతు పాత్ర పోషించింది సినీ రంగం. ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, లింగ బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరిని ఎంటర్‌టైన్ చేసే, ప్రతీ ఒక్కరి చేరువయ్యే రంగం సినిమా. కానీ అలాంటి ఇండస్ట్రీని మీడియా ఓ భయానక పరిశ్రమగా చిత్రీకరిస్తోంది.
undefined
మీడియా సినీ రంగం మీద ఈ దాడులు ఆపాలి. సినీ రంగం మీడియా కూడా కొన్ని బంధాలు ఉన్నాయి. కేవలం రేటింగ్‌లు, వ్యూయర్‌ షిప్‌లకన్నా మర్యాద ఇవ్వటం ముఖ్యం. అది ఇంకా ఉందని నిరూపించుకుందాం` అంటూ ఓ సుధీర్ఘ లేఖను రిలీజ్ చేసింది ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా.
undefined
undefined
undefined
click me!