జయప్రదను భుజంపై వేసుకుని పారిపోయిన నిర్మాత, సిరిసిరిమువ్వ సినిమా షూటింగ్ లో ఏం జరిగిందో తెలుసా?

Published : Nov 18, 2025, 07:40 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో ఊపు ఊపేసిన హీరోయిన్ జయప్రద. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ హీయిన్ ను.. ఒక సినిమా షూటింగ్ టైమ్ లో నిర్మాత భుజాన వేసుకుని పారిపోయిన సందర్భం గురించి మీకు తెలుసా?

PREV
15
అందాల తార జయప్రద

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో.. శ్రీదేవి, జయప్రద గ్లామర్ ప్రధానంగా సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఈ ఇద్దరు హీరోయిన్ల అందానికి పత్యేకంగా అభిమానులు ఉండేవారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి కమల్ హాసన్ వరకూ.. స్టార్ హీరోలందరితో జయప్రద సినిమాలు చేసింది. ఆమె చేసిన సినిమాలకు చాలా వరకూ సక్సెస్ రేటు ఉండేది. ఇక హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత.. చాలా తక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది జయప్రద. సినిమా కెరీర్ ను పక్కకు పెట్టి.. పాలిటిక్స్ పై ఫోకస్ చేసింది. ఇక ప్రస్తుతం పాలిటిక్స్ లో కూడా ఆమె యాక్టీవ్ గా లేదు.

25
కే విశ్వనాథ్ సినిమాల్లో మరింత అందంగా జయప్రద

జయప్రద ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కే విశ్వనాథ్ సినిమాల్లో ఆమె మరింత అందంగా కనిపించేవారు. ఆయన డైరెక్ట్ చేసిన సాగర సంగమం, సిరిసిరిమువ్వ లాంటి సినిమాల్లో జయప్రదను చూసి.. అప్పట్లో కుర్రకారు ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. విశ్వనాథ్ సినిమాలన్నింటిలో హీరోయిన్లను చాలా అందంగా చూపించేవారు. ఈక్రమంలో జయప్రద సినిమాలే కాదు.. ఆమె సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందా అని ఎదురుచూసి.. అక్కడివెళేవారు కొంత మంది అభిమానులు. అయితే ఈ అభిమానమే ఆమెకు ఒక సందర్భంలో చిక్కులు తెచ్చిపెట్టింది.

35
జనం మధ్యలో చిక్కుకుపోయిన జయప్రద

ఒక సారి సిరిసిరి మువ్వ షూటింగ్ జరుగుతోంది. ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రమోహన్, జయప్రదకు సబంధించిన సన్నివేశం షూట్ చేయాలి. జయప్రద, చంద్రమోహన్, విశ్వనాథ్ తో పాటు నిర్మాత ఏడిద నాగేశ్వరావు, కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అవుడోర్ షూటింగ్ కావడంతో జనాలు ఎక్కడి నుంచి వచ్చారో.. సడెన్ గా చాలామంది గుమ్మిగూడారు. జయప్రదను చూసి కుర్రాళ్లంతా ఆమె చట్టు చేరారు.. ఇబ్బందిపెట్టడం స్టార్ట్ చేశారు. చుట్టు జనంపెరిగిపోతుండటంతో.. వెంటనే విశ్వనాథ్ దూరంగా పరిగెత్తారు, గోపాల్ రెడ్డి కెమెరా భుజాన వేసుకుని పరుగు లంకించుకున్నారు. చంద్రమోహన్ కూడా పక్కన ఏదో బిల్డింగ్ మీదకు వెళ్లారు.

45
జయప్రదను భుజాన వేసుకుని పరిగెత్తిన నిర్మాత.

అందరు పారిపోయారు... హీరోయిన్ జయప్రద మాత్రం జనంలో చిక్కుని ఉన్నారు. ఇక వెంటనే నిర్మాత ఏడిద నాగేశ్వరావు ఆమెను భుజాన వేసుకుని, ఆ జనాలకు దొరక్కుండా పరిగెత్తారు, ఆమెను దూరంగా తీసుకెళ్లారు. అలా జయప్రదను జనం నుంచి కాపాడారు నిర్మాత. నిజానికి విశ్వనాథ్ కు ఇటువంటి సంఘటనలు అంటే భయం... అందుకే వెంటనే ఆయన పరుగులంకించుకున్నారు. సిరి సిరి మువ్వ షూటింగ్ సందర్భంగా జరిగిన ఈసంఘటన వివరాలను.. అప్పట్లో విశ్వనాథ్ కు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్, రచయిత కనగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
ప్రస్తుతం జయప్రద ఏం చేస్తున్నారు

సినీ నటిగా కెరీర్ కంప్లీట్ అయిన తరువాత రాజకీయాల్లోకి వెళ్ళారు జయప్రద. ఆంధ్రా రాజకియాల్లో కొంత కాలం యాక్టీవ్ గా ఉన్నఆమె.. ఆతరువాత ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి.. అక్కడే చాలా కాలం కొనసాగారు. ఆతరువాత పాలిటిక్స్ కు గుడ్ బై చేప్పి.. కొన్ని కార్యక్రమాలకు హోస్టింగ్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటూ..ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాన్న టాక్ నడుస్తుంది... కానీ ఆమె నుంచి మాత్రం ఎటువంటి అధికారికి ప్రకటన రాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories