Soundarya
నటి సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇంకా చాలా విషయాలు ఆమె జీవితంలో మిగిలే ఉంటాయి. ఆమె సినిమా రంగంలో కొనసాగింది కేవలం దశాబ్దం మాత్రమే. కానీ వందేళ్లు గుర్తుండిపోయేలా నటిగా సౌందర్య తన ప్రభావాన్ని చూపారు. దురదృష్టవశాత్తూ సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ళ చిన్న వయసులోనే సౌందర్య ప్రాణాలు వదిలారు.
Soundarya
సౌందర్య తండ్రి కేఎస్ సత్యనారాయణకి తన కుమార్తె అంటే ఎంతో ఇష్టం. సౌందర్య మరణం గురించి ఆమె తండ్రి సత్యనారాయణ ముందే తెలుసు అని ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తెలిపారు. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆమెతో, ఆమె తండ్రితో పరిచయం ఉంది. సౌందర్య తండ్రికి జ్యోతిష్యం పైన నమ్మకం ఎక్కువ. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చే ముందే ఆమె జాతకాన్ని సత్యనారాయణ జ్యోతిష్యుల వద్ద చూపించారట. మీ కుమార్తె సినిమా రంగంలోకి వెళితే తిరుగులేని హీరోయిన్ అవుతుంది. జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపు వస్తుంది.అయితే ఆమె ఇండస్ట్రీలో పదేళ్లు మాత్రమే కొనసాగుతుంది అని జ్యోతిష్యులు చెప్పారట.
పదేళ్ల తర్వాత సౌందర్యకి పెద్ద గండం ఉన్నట్లు కూడా చెప్పారు. ఈ విషయాలని సత్యనారాయణ.. నిర్మాత చిట్టిబాబుతో షేర్ చేసుకున్నారట. కానీ ఆమెకి గండం ఉన్న విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పారు. పదేళ్ల తర్వాత సౌందర్య ఇండస్ట్రీకి దూరం అయిపోతుంది అని అన్నారట. అప్పటికి సౌందర్యకి పెళ్లైపోయింది. కాబట్టి అలా చెప్పరేమో అని అనుకున్నా. కానీ ఆమె మరణించిన తర్వాతే ఆయన చెప్పిన మాటల్లో అర్థం తెలిసింది అని చిట్టిబాబు అన్నారు.
సౌందర్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఒకసారి కలిశా. అమ్మా మీ నాన్న చెప్పినవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని చెప్పారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా అన్ని భాషల్లో స్టార్ హీరోలందరితో నటించావు. ఇక మిగిలింది ఒక్కటే.. ఇండస్ట్రీ దూరంగా ఉంటూ నీ ఫ్యామిలీతో గడుపుతావు అని చెప్పారట. దీనికి సౌందర్య రియాక్ట్ అవుతూ అంత మాట మాట అన్నారేంటి సార్.. మా నాన్న చెప్పినవన్నీ జరిగాయి. ఇదొక్కటే తప్పు అని నిరూపిస్తా. మరణించే వరకు సినిమా రంగంలోనే కొనసాగుతా అని చెప్పింది.
పైన తధాస్తు దేవతలు ఆశీర్వదించారో ఏమో నటిగా ఉన్నప్పుడే ఆమె మరణించింది అని చిట్టిబాబు తెలిపారు. 1993లో సౌందర్య నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దాదాపు 100 చిత్రాల్లో నటించింది.