RC16 Ram chara First Look: రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడంతో పాటు.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసేలా అప్ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే షూటింగక పరుగులు పెట్టిస్తున్న బుచ్చిబాబు.. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు సాలిడ్ అప్ డేట్ ను రిలీజ్ చేశారు. ఆర్ సి 16 టైటిల్ తో పాటు చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో బర్త్ డే విష్ చేస్తున్నారు. అంతే కాదు తన నెక్స్ట్ సినిమా తన కెరీర్ 16వ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే గట్టి హైప్ అందుకున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా వచ్చేసింది.
ఒకటి కాదు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఈ సినిమా నుంచి రిలీజ్ చేసారు. అంతే కాదు టైటిల్ ను కూడా రివిల్ చేశారు. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఈసినిమాకు పెద్ది టైటిల్ ను ఫిక్స్ చేశారు టీమ్. ఈ పోస్టర్స్ లో రామ్ చరణ్ ఊహించని లుక్ లో అదరగొట్టేసాడు ఒక లుక్ లో బీడీ కాలుస్తూ ఇంకో లుక్ లో బ్యాట్ పట్టుకొని ఊరమాస్ లుక్స్ తో చరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది నిజంగా అభిమానులకుపండగనే చెప్పాలి.
అయితే ఈ పోస్టర్స్ లో రామ్ చరణ్ లుక్ చూస్తుంటే సుకుమార్ మార్క్ కనిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు లుక్ తో పాటు.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ మిక్స్ చేసినట్టుగా అనిపిస్తోంది. లుక్స్ సంగతి తరువాత మరి ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
మొత్తాని ఈసినిమాకు పెద్ది టైటిల్ అనౌన్స్ చేసి ఉత్కంఠకు తెర తీశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.