ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో ఎంత పెద్ద రచ్చ అయిందో చూశాం.