ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల క్రియాశీలకంగా వ్యవహరించింది. వైసీపీ తరుపున ఆమె జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్యామల సెలెబ్రిటీ కాబట్టి ఆమెని ఉపయోగించుకుని వ్యాఖ్యలు చేయించారో లేక ఆమె స్వయంగా చేసిందో తెలియదు కానీ.. శ్యామల కాస్త ఘాటుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది.
26
ఇటీవల కూడా శ్యామల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఇంకా రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ ఆవేశపడడం, ఆయాస పడడం తప్ప ఇతరులకు సహాయ పడడం తానెప్పుడూ చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
36
దీనితో ఎప్పటిలాగే ట్రోలింగ్ ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం లో సైతం ఓటమి చెందుతారు. వంగా గీత విజయం సాధిస్తుంది అని శ్యామల పడే పదే చెబుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ పై ఇంకా పలు విమర్శలు చేసింది.
46
నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అలాగే ఏపీ ఎన్నికల ఫలితాలు రావడం మొదలయ్యాయి. దాదాపుగా తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి భారీ విజయం లాంఛనం అయిపోయింది. ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ఖరారయింది.
56
దీనితో బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ శ్యామలపై సెటైరికల్ గా కౌంటర్ వేసారు. నితిన్ అ..ఆ.. చిత్రంలోని ఎళ్ళిపోకే శ్యామల, ఏమి బాగాలేదు అంటూ పాటని షేర్ చేసింది.
66
జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ అధినాయకుడు బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి ఆడుగుపెడుతుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు.