ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం.. సతీమణి మృతి..

First Published | Aug 8, 2024, 2:06 PM IST

ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 

ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై టివి కార్యక్రమాలు, షోలు, జబర్దస్త్, ఢీ లాంటి పాపులర్ షోలు రూపొందిస్తున్నారు. గతంలో ఆయన అనేక చిత్రాలు కూడా నిర్మించారు. 

కాగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ తో పోరాడినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగవలేదు. ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. దీనితో శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. 


శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె ఆమె. ఆమె మరణంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమర్తెలు సంతానం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా తలంబ్రాలు, అంకుశం, అమ్మోరు, అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. 

Latest Videos

click me!