సిగ్గు లేకుండా వెళ్లి మహేష్ బాబును భోజనం పెట్టమన్న నటుడు... ఆయన ఏం చేశారో తెలుసా?

First Published | Aug 8, 2024, 1:49 PM IST


మహేష్ బాబును ఓ నటుడు సిగ్గు లేకుండా వెళ్లి అన్నం పెట్టమని అడిగాడట. మురారి సెట్స్ లో జరిగిన ఓ ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. 
 

Mahesh Babu

ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు కెరీర్లో సూపర్ హిట్ గా ఉన్న మురారి చిత్రాన్ని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మురారి మహేష్ బాబు ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మహేష్ నటన, సోనాలీ బింద్రే గ్లామర్, మణిశర్మ సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రానికి హైలెట్. 

Murari

మురారి చిత్రంలో భారీ తారాగణం నటించారు. కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి, రవిబాబు, రఘుబాబు, శివాజీ రాజా, సుధ, అన్నపూర్ణ... ఇలా స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. సీనియర్ నటుడు చిన్నా హీరో మహేష్ బాబుకు అన్నయ్య పాత్ర చేశాడు. తాజాగా చిన్నా మురారి సెట్స్ లో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. 


Murari

మురారి సినిమా షూటింగ్ రామచంద్రాపురం అనే గ్రామంలో జరిగిందట. 50 రోజుల లాంగ్ షెడ్యూల్. అందరికీ ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెట్టేవారట. మహేష్ బాబుకు మాత్రం నిర్మాత బంధువుల ఇంటి నుండి భోజనం వచ్చేదట. చిన్నాకు ప్రొడక్షన్ భోజనం సహించదట. అందుకే ఇంటి నుండి భోజనం తెప్పించుకుని తింటారట. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో ప్రొడక్షన్ వాళ్ళు పెట్టే ఫుడ్ తినాల్సి వచ్చిందట. 

Actor Chinna

రెండు రోజులు అడ్జస్ట్ అయ్యాడట. మూడో రోజు లాభం లేదని నేరుగా మహేష్ బాబు వద్దకు వెళ్లి సిగ్గు లేకుండా భోజనం పెట్టమని అడిగాడట. మహేష్ బాబుకు తెప్పించే భోజనం ఆయనకు కూడా పెట్టాలని చిన్నా రిక్వెస్ట్ చేశాడట. అయ్యో దానిదేముంది రండి తిందాం అని మహేష్ బాబు అన్నారట. తర్వాత శివాజీ రాజా కూడా వచ్చి మహేష్ బాబు వద్ద రోజూ భోజనం చేసేవాడట. 

Actor Chinna

ఒక్కోసారి మహేష్ బాబుకు ఆలస్యం అయ్యేదట. మీరు తినేసి నాకు ఉంచండి, నేను వచ్చి తింటాను, అనేవారట. శివాజీ రాజా, చిన్నా తిని మిగిలిన భోజనం ఉంచేవారట. తర్వాత మహేష్ వచ్చి భోంచేసేవారట. రామచంద్రాపురంలో షూటింగ్ ముగిసే వరకు తమకు మహేష్ బాబు తన భోజనం పెట్టారని... ఆయన చెప్పుకొచ్చాడు. 

Latest Videos

click me!