అఫీషియల్: నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం పూర్తి..కొత్త జంటకి నాగార్జున బ్లెస్సింగ్స్, బ్యూటిఫుల్ ఫొటోస్  

First Published | Aug 8, 2024, 1:41 PM IST

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. వీళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది. 

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. వీళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది. అయితే పైకి చెప్పకుండా నాగ చైతన్య, శోభిత సైలెంట్ మైంటైన్ చేస్తూ వచ్చారు. 

ఎట్టకేలకు వీళ్ళిద్దరూ తమ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నాగార్జున, శోభిత ధూళిపాలకి నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కొత్త జంటని ఆశీర్వదించిన ఫొటోస్ ని నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. 


నాగ చైతన్య సాంప్రదాయ వస్త్రధారణలో గడ్డం లుక్ లో కనిపిస్తున్నారు. ఇక శోభిత లైట్ ఆరెంజ్ కలర్ శారీలో మెరిసిపోతోంది. కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా ఉన్నారు. ఒక ఫొటోలో వీరిద్దరూ నాగార్జునతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. మరో పిక్ లో శోభిత తనకి కాబోయే భర్త చైతూని ప్రేమగా హగ్ చేసుకుని ఉంది. 

శోభిత ధూళిపాలతో మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ వేడుక ఉదయం 9.42 కి జరిగింది. శోభిత ని మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. జీవితాంతం వీళ్ళిద్దరూ ప్రేమానురాగాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. అయితే పెళ్లి తేదీని ప్రకటించలేదు. వీళ్లిద్దరి వివాహం కూడా త్వరలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. సమంత నుంచి విడిపోయాక చైతు శోభితతో సెకండ్ మ్యారేజ్ కి రెడీ అయ్యాడు. 

Latest Videos

click me!