పవన్ కళ్యాణ్ తో మూవీ చేసింది, ఆమె బిహేవియర్ వల్లే స్టార్ హీరోలు పక్కన పెట్టారు..క్రేజీ హీరోయిన్ పై కామెంట్స్

First Published | Sep 15, 2024, 11:43 AM IST

చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందం అభినయం ఉన్నప్పటికీ సరైన ఆఫర్లు రావు. వరుస ఫ్లాపులు ఎదురైతే అలాంటి హీరోయిన్లని దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు.

చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందం అభినయం ఉన్నప్పటికీ సరైన ఆఫర్లు రావు. వరుస ఫ్లాపులు ఎదురైతే అలాంటి హీరోయిన్లని దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు. కానీ మరికొందరు హీరోయిన్లు మాత్రం వివిధ కారణాల వల్ల మంచి ఆఫర్లు మిస్ అవుతుంటారు. 

హోమ్లీ హీరోయిన్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి మీరా జాస్మిన్. తెలుగులో మీరా జాస్మిన్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. అమ్మాయి బాగుంది అనే చిత్రంతో మీరా జాస్మిన్ టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే మీరా జాస్మిన్ ఫస్ట్ సైన్ చేసిన మూవీ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్. కానీ శివాజీకి జోడిగా నటించిన అమ్మాయి బావుంది చిత్రం ముందుగా రిలీజ్ అయింది. ఆ మూవీ మంచి హిట్ అయింది. 

Also Read: స్టార్ హీరోయిన్లు అవమానించారు, అందుకే రాజేంద్ర ప్రసాద్ ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?


Meera Jasmine

గుడుంబా శంకర్ సాంగ్స్ బావుంటాయి కానీ సినిమా నిరాశ పరిచింది. అయితే అమ్మాయి బావుంది చిత్ర నిర్మాత పైడి బాబు.. మీరా జాస్మిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సినిమా నిర్మించాలని అనుకున్నప్పుడు అమ్మాయి బావుంది చిత్రం ఓకె అయింది. హీరోయిన్ ఎవరైతే బావుంటుంది అనుకుంటుండగా మీరా జాస్మిన్ గురించి తెలిసింది. ట్యాలెంట్ అందం ఉన్న అమ్మాయి మీరా జాస్మిన్. వెంటనే ఆమెని ఓకె చేశాం. 

ఆమెలో ఉన్న ఒకే ఒక్క మైనస్.. యాటిట్యూడ్ చూపించడం. అది చాలా మందికి నచ్చలేదు. అందుకే ఆమెకి గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఛాన్సులు రాలేదు అని అన్నారు. మీరా జాస్మిన్ తో నటించిన స్టార్ హీరోలు ముగ్గురే. పవన్ కళ్యాణ్, బాలయ్య, రవితేజ. బాలయ్యతో మహారథి చిత్రంలో నటించింది. ఇక రవితేజ తో నటించిన భద్ర చిత్రం మీరా జాస్మిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

ఆమె సెట్స్ లో కాస్త పొగరు గా యాటిట్యూడ్ చూపిస్తుంది అని పైడి బాబు అన్నారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరా జాస్మిన్ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీ విష్ణు స్వాగ్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

Latest Videos

click me!