రాంచరణ్, అనుష్క, ఎన్టీఆర్ కనుక టీచర్లు అయితే..ఎవరెవరు ఏ సబ్జెక్టులు చెబుతారంటే, వైరల్ కామెంట్స్

Published : Sep 15, 2024, 10:18 AM IST

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాంచరణ్ అయితే రానాకి చైల్డ్ హుడ్ ఫ్రెండ్. చిన్నపుడు చరణ్ తో కలసి చాలా అల్లరి చేసినట్లు రానా పలు సందర్భాల్లో తెలిపారు. 

PREV
15
రాంచరణ్, అనుష్క, ఎన్టీఆర్ కనుక టీచర్లు అయితే..ఎవరెవరు ఏ సబ్జెక్టులు చెబుతారంటే, వైరల్ కామెంట్స్
Rana Daggubati

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాంచరణ్ అయితే రానాకి చైల్డ్ హుడ్ ఫ్రెండ్. చిన్నపుడు చరణ్ తో కలసి చాలా అల్లరి చేసినట్లు రానా పలు సందర్భాల్లో తెలిపారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్, ఎన్టీఆర్, అనుష్క ఇలా చాలా మంది స్నేహితులు అయ్యారు. 

 

25

ఇటీవల ఒక సందర్భంలో రానా మాట్లాడుతూ రాంచరణ్, అనుష్క, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళిపై ఫన్నీగా కామెంట్స్ చేశారు. రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక వేళ వీళ్ళు కనుక టీచర్ అయితే ఎలా ఉంటుంది.. ఎవరెవరు ఏ సబ్జెక్టులు చెబితే బావుంటుంది అనే విషయాన్ని రానా ఫన్నీగా చెప్పారు. 

 

35

ముందుగా రామ్ చరణ్ కనుక టీచర్ అయితే.. హార్స్ రైడింగ్ క్లాసులు చెబితే బావుంటుంది అని అన్నారు. రాంచరణ్ కి హార్స్ రైడింగ్ బాగా తెలుసు. ప్రభాస్ కనుక టీచర్ అయితే అందరితో హ్యాపీగా ఉండడం ఎలాగో నేర్పిస్తాడు. ప్రభాస్ బిహేవియర్ కల్చరల్ క్లాస్ టీచర్ అయితే బావుంటుంది అని అన్నారు. 

 

45
Anushka shetty

అనుష్క కూడా ప్రభాస్ లాగానే. ఆమె మంచితనం గురించి క్లాసులు చెబుతారు అని అన్నారు. ఒరిజినల్ గా అనుష్క యోగా టీచర్ అనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అయితే పక్కాగా తెలుగు టీచర్ అయితే బావుంటుంది. ఎన్టీఆర్ కంటే బాగా తెలుగు ఎవరు చెప్పగలరు అని రానా అన్నారు. 

 

55

ఇక రాజమౌళి గురించి చెబుతూ.. ఆయన కేవలం ఒక్క సబ్జెక్టు కాదు ట్యూషన్ మాస్టర్ లాగా అన్ని సబ్జెక్టులు చెబుతారు అని రానా తెలిపారు. రానా త్వరలో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

Read more Photos on
click me!

Recommended Stories