నందమూరి బాలకృష్ణకి ఒక దశలో చాలా బ్యాడ్ టైం కొసాగింది. లక్ష్మి నరసింహ చిత్రం తర్వాత దాదాపు 6 ఏళ్ళు బాలయ్యకి సరైన హిట్ లేదు. ఎలాంటి చిత్రం చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతోంది. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, మహారథి, వీరభద్ర, ఒక్క మగాడు, మిత్రుడు లాంటి ఫ్లాప్ చిత్రాలన్నీ ఆ టైం లో వచ్చినవే.