ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు ఎప్పటినుంచో ఓ కోరిక ఉంది. విజయ్ భారీగా ప్లాన్ కూడా చేశారు. కానీ అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే?
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు ఆర్.బి.చౌదరి. రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా జుండా గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన వయసు 76 ఏళ్లు . ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గౌతమ్ చెర్వి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
25
బంధువుల పెళ్లికి వెళ్లి వస్తుండగా..
సమాచారం ప్రకారం, ఆర్.బి.చౌదరి లీలంబ గ్రామంలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లి, తన మేనల్లుడితో కలిసి కారులో తిరిగి వస్తున్నారు. జుండా గ్రామం దగ్గరకు రాగానే, రోడ్డుకు అడ్డంగా పశువులు రావడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్.బి.చౌదరి అక్కడికక్కడే మృతి చెందారు.
35
40 ఏళ్లుగా నిర్మాణ రంగంలో..
ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. గత 40 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్న చౌదరి, 'గోకులంలో సీత', 'సూర్యవంశం' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. సుధీష్ శంకర్ దర్శకత్వంలో వడివేలు, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మారీశన్' ఆయన నిర్మించిన చివరి చిత్రం. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా 2025 జులైలో విడుదలైంది.
నిర్మాత ఆర్.బి.చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ద్వారా ఇప్పటివరకు 99 చిత్రాలను నిర్మించారు. తన 100వ చిత్రంలో హీరో విజయ్ తో చేయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. దీనికోసం గత కొన్నేళ్లుగా విజయ్ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ విజయ్ అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించడంతో, ఆర్.బి.చౌదరి నిర్మాణంలో నటించే అవకాశం లేకుండా పోయింది. దీంతో తన 100వ సినిమాలో విజయ్‌ని హీరోగా చూడాలన్న ఆయన కల నెరవేరకుండానే కన్నుమూశారు.
55
తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో జీవా
ఆర్.బి.చౌదరి కుమారులు జీవా, జితన్ రమేష్ ఇద్దరూ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నారు. వీరిలో జీవా, చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది పొంగల్‌కు విడుదలైన 'తలైవర్ తంబి తలైవనం' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కొడుకు చాలా కాలం తర్వాత విజయం సాధించడంతో ఆర్.బి.చౌదరి చాలా సంతోషంగా ఉన్నారు. తండ్రి మరణంతో నటుడు జీవా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో చూసి అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.