Ntr, Devara, koratala shiva
ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర` చిత్రం గత నెలాఖరులో విడుదలై విజయవంతంగా రన్ అవుతుంది. ఈ మూవీ 460కోట్లకుపైగానే కలెక్ట్ చేసిందని టీమ్ ప్రకటించింది. ఐదువందల క్లబ్‌లో చేరబోతుందని వెల్లడించింది. సినిమా దుమ్ములేపుతుందని అంతా అనుకున్నారు. అదే ప్రచారం జరుగుతుంది. కానీ సినిమా కలెక్షన్లు ఫేక్ అని, 30 శాతం హైక్ చేసి పోస్టర్లలో ప్రకటిస్తున్నారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్ జరిగింది. ముఖ్యంగా ప్రారంభంలో మూడు రోజుల కలెక్షన్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. కానీ టీమ్ మాత్రం ఊహించని కలెక్షన్లు వెల్లడించడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్లపై చర్చ నడుస్తుంది. ఇదే కాదు, చాలా సినిమాల కలెక్షన్లపై ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. `కల్కి 2898 ఏడీ` కలెక్షన్లపై కూడా ఇలాంటి చర్చనే నడిచింది. ఈ నేపథ్యంలో `దేవర` కలెక్షన్లు ఫేక్ అనే వార్తలపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. `లక్కీ భాస్కర్` సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ సందర్భంగా శుక్రవారం ఆయన తన ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
`దేవర` సినిమాని నాగవంశీ ఏపీలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా కలెక్షన్లు ఎంత వరకు నిజం? ఎంత వచ్చాయా? లాభమా? నష్టమా? ఫేక్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. సినిమా కలెక్షన్లు నిజమే అని ఆయన వెల్లడించడం విశేషం.
పోస్టర్లలో కలెక్షన్లు పెంచి వేయడంపై స్పందిస్తూ, పోస్టర్లలో కలెక్షన్లు ఫ్యాన్స్ కోసం వేస్తున్నామని, వాళ్లు హ్యాపీ అయితే మేం హ్యాపీ అన్నారు. `దేవర` కలెక్షన్లు నిజమే అని, సినిమాని కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్‌లో ఉన్నారు. వాళ్లకి లాభాలు కూడా వచ్చాయని, అంతా హ్యాపీగానే ఉన్నారని తెలిపారు. నేను హ్యాపీ అని చెప్పినా, నాకు డబ్బులు వచ్చాయని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా అని అన్నారు.
ఫస్ట్ డే కలెక్షన్లు ప్రకటిస్తే తప్పు అనే చెప్పారు. నేను ఏం చెప్పినా మీరు(మీడియా) నమ్మరు కదా. నేను సినిమా కొని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాను. నా సినిమా కొన్న వాళ్లంతా హ్యాపీ అని చెప్పారు నాగవంశీ. హైయ్యెస్ట్ గ్రాస్ ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చిందన్నారు. `దేవర` సినిమాకి సంబంధించి మేం ఒరిజినల్ నెంబర్సే ఇచ్చామన్నారు.
`దేవర` చిత్రానికి మిడ్ నైట్ షోస్ ప్రదర్శించడంపై స్పందిస్తూ, అలా చేయడం ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా అనే ప్రశ్నకి అది కూడా మీరే చెప్పాలంటూ సెటైర్లు వేశారు నాగవంశీ. ఈ మూవీ ద్వారా ఓ కొత్త విషయం నేర్చుకున్నాని, మిడ్ నైట్ షోస్ టాక్ ఎలా ఉన్నా, సినిమా బాగుంటే ఆడియెన్స్ వస్తారని అర్థమయ్యిందని తెలిపారు.
`గుంటూరు కారం` విషయంలోనూ అదే జరిగిందన్నారు. అందుకే తాను నిర్మించిన `లక్కీ భాస్కర్` సినిమాని కూడా ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నామని తెలిపారు. ఫస్ట్ షో నుంచే రెగ్యూలర్ షోలు పడతాయన్నారు. ఈ మూవీ నుంచి మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నామని చెప్పారు.
`లక్కీ భాస్కర్` సినిమా గురించి చెబుతూ, షేర్ మార్కెట్‌పై సాగే కథ ఇదని, బ్యాంకింగ్ వ్యవస్థల గురించి ఓ కొత్త పాయింట్‌ని చర్చించబోతున్నామని తెలిపారు. అందులోని మోసాలను, కుంభకోణాలను కూడా చూపిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇదేమో సందేశం ఇచ్చే సినిమా కాదు, కేవలం ఎంటర్టైన్‌మెంట్ కోసం చేసిందే, ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.
ఈ నెల 31న సినిమాని విడుదల చేస్తున్నామని, అక్టోబర్ 21న `లక్కీ భాస్కర్` ట్రైలర్‌ని, 26గానీ, 27న గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తామని, హైదరాబాద్, ఏపీలోనూ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు నాగవంశీ. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన `లక్కీ భాస్కర్` సినిమాలో దుల్కర సల్మాన్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
Read more: `మార్టిన్` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్