Dil Raju: డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాత వరకు.. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దాకా దిల్ రాజు ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయన ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఇంత స్థాయికి చేరుకున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లు, స్టార్ హీరోలతో జర్నీ, విజయాలు, పరాజయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తనకు ఇష్టమైన హీరో, ఎప్పుడూ కూడా కలిసి పని చేయాలనుకునే హీరో గురించి కీలక కామెంట్స్ చేశారు.
25
స్టార్ హీరోలలో గురించి..
తాను పని చేసిన స్టార్ హీరోలలో గురించి మాట్లాడిన దిల్ రాజు.. అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ స్మార్ట్ అని చెప్పుకొచ్చారు. బెస్ట్ ఎవరూ అంటే చెప్పలేమని.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుందని, అందరిలో అన్ని ఉండవని, కాబట్టి ఎవరినీ ఎవరితోనూ పోల్చలేనని స్పష్టం చేశారు.
35
క్లిష్ట పరిస్థితులనైనా బ్యాలెన్స్..
ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా బ్యాలెన్స్ చేయగలగడం తన ప్లస్ అని, అయితే ప్రెస్ మీట్‌లలో ఉన్నది ఉన్నట్లు ఓపెన్‌గా చెప్పడం వల్ల కొందరు హర్ట్ అవుతారని, అది తన మైనస్ అని దిల్ రాజు చెప్పారు. మార్చుకోలేని అలవాటు ఏదైనా ఉందా అని అడిగితే, స్వీట్లు మానేయడం అని సరదాగా చెప్పుకొచ్చారు.
తనతో పని చేసిన హీరోలలో ఎవరూ కూడా వాంటెడ్లీ ఇబ్బందికి గురి చేయరని, సిచ్యువేషన్ డిమాండ్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయని, అయితే ఆ తర్వాత వారితో మళ్లీ పని చేశానని వివరించారు. రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బందులు జరుగుతుండటం సర్వసాధారణమని, ఇబ్బంది పెట్టే ఆర్టిస్టులు తగులుతుంటారని తెలిపారు.
55
మళ్లీ మళ్లీ పని చేయాలనిపించే హీరో..
మళ్లీ మళ్లీ పని చేయాలనిపించే హీరో పవన్ కళ్యాణ్ అని దిల్ రాజు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికితే ఇతర సినిమాలను వదిలేసి ఆయనతో సినిమా చేస్తానని, ఆయనకు కచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక్కడు సినిమా చూసి, తాను ప్రొడ్యూసర్‌గా అయినప్పుడు అలాంటి సినిమా తీయాలనుకున్నానని, అయితే అలాంటి స్క్రిప్ట్ ఇంకా తనకు దొరకలేదని దిల్ రాజు అన్నారు.