అయితే 1999-2000 మధ్య కాలంలో వ్యక్తిగతంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇంద్రజ వెల్లడించింది. తన తల్లి ఓ కార్డియాక్ పేషెంట్, హార్ట్‌లో వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. కుటుంబం మొత్తం ఆర్థికంగా తనపై ఆధారపడటంతో, తాను బాధపడుతూ కూర్చోలేదని, ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది. అదే సమయంలో, 'సొగసు చూడతరమా' చిత్రాన్ని పనామా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూసిన మలయాళ దర్శకుడు సిబి మలయిల్ తనను సంప్రదించారని తెలిపింది.