అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నించారు కానీ కుదిరేలా లేదు. ఎందుకంటే అదే నెలలో పుష్ప 2, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ తండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్న బన్నీ వాసు తాజాగా నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య ప్రస్తుతం ఏదో సాధించాలనే తపనతో ఉన్నారు. దీని కోసం అన్నీ వదులుకుని వచ్చారు. తాను నాగార్జున కొడుకుని అనే ఫీలింగ్ నే నాగ చైతన్య పక్కన పెట్టేశారు.
నాగ చైతన్య తండేల్ చిత్రం కోసం ఒక కామన్ మ్యాన్ లాగా కష్టపడుతున్నారు. రాజు అనే సాధారణ కుర్రాడిగా మారిపోయారు. తాను కామన్ మాన్ కి చేరువ కావాలంటే తాను కూడా కామన్ మ్యాన్ కావాలని నాగ చైతన్య భావించినట్లు బన్నీ వాసు తెలిపారు.
ఇది వరకు నాగ చైతన్య వేరు.. ఇప్పుడు ఉన్న నాగ చైతన్య వేరు అని బన్నీ వాసు తెలిపారు. నేను కొన్ని సాధించాలంటే కొన్ని వదిలేసుకోవాలి అని నాగ చైతన్య డిసైడ్ అయ్యారు. నేను పెద్దింటి అబ్బాయిని అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి తండేల్ మూవీలో నటిస్తున్నట్లు బన్నీ వాసు పేర్కొన్నారు.
Naga Chaitanya
తండేల్ చిత్రంలో నాగ చైతన్య రాజు అనే మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాకుళం యాసలో ఈ చిత్రం ఉంటుంది. మత్స్యకారుడు పాకిస్తాన్ లో ఎలా చిక్కుకున్నాడు.. అతడి ప్రేమ ఏమైంది అనే విషయాలని దేశభక్తి కథాంశంతో చందు ముండేటి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇటీవల నాగ చైతన్య శోభిత ధూళిపాలని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.