నాగార్జున, మహేష్, వెంకటేష్ చిత్రాలు డిజాస్టర్.. కోలుకోలేని దెబ్బతో పారిపోయిన నిర్మాత, పరిస్థితి అంత దారుణమా

Published : Jul 18, 2024, 03:25 PM IST

చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎన్ని హిట్ చిత్రాలు చేసినప్పటికీ దారుణమైన నష్టాలు వచ్చే ఒక్క చిత్రాలు చాలు.. పరిస్థితి తలక్రిందులు అయిపోతుంది.

PREV
16
నాగార్జున, మహేష్, వెంకటేష్ చిత్రాలు డిజాస్టర్.. కోలుకోలేని దెబ్బతో పారిపోయిన నిర్మాత, పరిస్థితి అంత దారుణమా
Mahesh Babu

చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎన్ని హిట్ చిత్రాలు చేసినప్పటికీ దారుణమైన నష్టాలు వచ్చే ఒక్క చిత్రాలు చాలు.. పరిస్థితి తలక్రిందులు అయిపోతుంది. కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఆటుపోట్లు నష్టాలు ఎదుర్కొని కొంతకాలం నిలబడగలతారు. 

26

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా అశ్విని దత్ ఉంటారు. ఒకప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని నిర్మించినా.. ఇప్పుడు ప్రభాస్ తో కల్కి చిత్రాన్ని నిర్మించినా ఆయనకే చెల్లింది. చూడాలని ఉంది, పెళ్లి సందడి లాంటి అద్భుతమైన చిత్రాలని కూడా ఆయన నిర్మించారు. 

36

అదే విధంగా అశ్విని దత్ నిర్మించిన డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్ మూవీస్ గురించి మాట్లాడారు. యాంకర్ ప్రశ్నిస్తూ మీకు తగిలిన మొట్ట మొదటి దెబ్బ వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ చిత్రం కదా అని ప్రశ్నించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. ధైర్యంగానే నిలబడ్డాను. 

46

సుభాష్ చంద్రబోస్ తో పాటు నాగార్జునతో చేసిన గోవిందా గోవిందా, రావోయి చందమామ చిత్రాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అవేమి నన్ను ఇబ్బంది పెట్టలేదు. తర్వాత చిత్రాలకు మూవ్ అయిపోయాను. 

56

మహేష్ బాబుతో సైనికుడు చిత్రం చేశాం. అది కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అప్పుడు కూడా నేను ధైర్యం కోల్పోలేదు. తర్వాత చూసుకుందాం లే అనుకున్నాం. నాకు కోలుకోలేని దెబ్బ తగిలింది మాత్రం ఎన్టీఆర్ శక్తి సినిమాతోనే అని అశ్విని దత్ అన్నారు. చాలా భారీ నష్టాలు ఆ చిత్రంతో వచ్చాయి. టైం బాగాలేదు అనుకుని కొంతకాలం సినిమాలు ఆపేయడం మంచిది అని భావించాను. 

66

అందుకే ఐదారేళ్ళ గ్యాప్ తీసుకున్నా. దీనితో కొందరు పత్రికల్లో తాను అమెరికా పారిపోయారు అని కూడా రాశారు అని అశ్విని దత్ అన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. గ్యాప్ తీసుకున్న మాట వాస్తవం అని తెలిపారు. చిన్న చిన్న పరాజయాలు ఎదురైతే తట్టుకోగలం. శక్తి లాంటి డిజాస్టర్ ఎదురైనప్పుడు కాస్త ఆగి సమీక్ష చేసుకోవడం మంచిది అని అన్నారు.  

click me!

Recommended Stories