బిగ్ బాస్ హౌస్లో జరిగిన షాకింగ్ మేటర్ లీక్... అందరి ముందు చెప్పి శోభా శెట్టి పరువు తీసిన అంబటి అర్జున్!

Published : Jul 18, 2024, 01:16 PM ISTUpdated : Jul 21, 2024, 11:24 AM IST

బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలు బయటపెట్టాడు అంబటి అర్జున్. అందరి ముందు శోభా శెట్టి పరువు తీశాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం...   

PREV
18
బిగ్ బాస్ హౌస్లో జరిగిన షాకింగ్ మేటర్ లీక్... అందరి ముందు చెప్పి శోభా శెట్టి పరువు తీసిన అంబటి అర్జున్!
Kiraak boys Khiladi girls

తెలుగు బుల్లితెర పరిశ్రమలో స్టార్ మా దూసుకుపోతుంది. ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్న ఈటీవీ, జెమినీ రేసులో వెనుకబడ్డాయి. స్టార్ మా, జీ తెలుగు మార్కెట్ ని కొల్లగొడుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ షోల విషయంలో ఈటీవీ సత్తా చాటుతుంది. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు అత్యంత ఆదరణ దక్కించుకుంటున్నాయి.

28
Kiraak boys Khiladi girls

ఈ మార్కెట్ ని కొల్లగొట్టాలని స్టార్ మా అనేక ప్రయత్నాలు చేస్తుంది. వినూత్నమైన షోలతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే గేమ్ షో స్టార్ట్ చేశారు. బుల్లితెర సెలబ్స్ ని రంగంలోకి దించారు. 
 

38
Kiraak boys Khiladi girls


అనసూయ-శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ దాదాపు రెండేళ్ల తర్వాత బుల్లితెరపై కనిపించింది. ఒకప్పటి జబర్దస్త్ అనసూయను గుర్తు చేస్తుంది. అనసూయ ఈ షోలో ధరించే బట్టలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 
 

48
Kiraak boys Khiladi girls

తాజా ఎపిసోడ్ కోసం ఆమె గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించింది. ఇక హెయిర్ స్టయిల్ చూస్తే మతిపోయేలా ఉంది. జుట్టుకు కలర్ వేసి, కర్లీ లుక్ లో సరికొత్తగా కనిపించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అమ్మాయిలను రిప్రజెంట్ చేస్తుంది అనసూయ. ఇక అబ్బాయిలకు శేఖర్ మాస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

58
Kiraak boys Khiladi girls

ఈసారి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో హోటల్ థీమ్ పెరఫార్మ్ చేశారు. ''ఆకలేస్తే అన్నం పెడతా'' అనే హోటల్ లో అమ్మాయిలు అబ్బాయిలు పని చేస్తారు. వారు వంట చేస్తారన్నమాట. సీరియల్ నటులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్...  అబ్బాయిలు, అమ్మాయిలుగా విడిపోయి పోటీపడుతున్నారు.

68
Kiraak boys Khiladi girls


ఈ షోకి శోభా శెట్టి హెవీ గా ఉన్న లాంగ్ డ్రెస్ ధరించి వచ్చింది. శోభా శెట్టిని ఆ డ్రెస్ లో చూసిన శ్రీముఖి.. అసలు వంట చేయడానికి ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుని వస్తారా? అని అడిగింది. మధ్యలో కల్పించుకున్న అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయం గుర్తు చేసుకున్నాడు. 

78
Kiraak boys Khiladi girls

'అది ఇంతకంటే బాగా రెడీ అయి బాత్ రూమ్ లు కడిగేది' అన్నాడు. దాంతో సెట్ లో ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటి పని స్వయంగా చేసుకోవాలి. కెప్టెన్ హౌస్ మేట్స్ అందరికీ పని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ క్రమంలో శోభా శెట్టి కొన్ని రోజులు బాత్ రూమ్స్ కూడా కడిగింది.

88
Kiraak boys Khiladi girls

శోభా శెట్టికి మేకప్ పిచ్చి. బిగ్ బాస్ హౌస్లో చాలా గ్లామరస్ గా తయారయ్యేది. తనకు మేకప్ పై గట్టి కమాండ్ ఉందని శోభా శెట్టి గతంలో చెప్పడం విశేషం. అందుకే హౌస్ నుండి వచ్చాక మేకప్ స్కూల్ పెడతామనని ఆమె అన్నారు. ఆ ఆలోచన ఎంత వరకు వచ్చిందో తెలియదు.. 
 

Read more Photos on
click me!

Recommended Stories