Chiranjeevi చించేశాడు, బాస్‌ ఈజ్‌ బాస్‌.. `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీపై అరవింద్‌ క్రేజీ రివ్యూ

Published : Jan 12, 2026, 05:52 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ థియేటర్లలో రచ్చ చేస్తోంది. సినిమా చూసిన చిరు బామ్మర్ది, నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించి తనదైన రివ్యూ ఇచ్చాడు. 

PREV
15
పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న మన శంకర వరప్రసాద్‌ గారు

మెగాస్టార్‌ చిరంజీవి మూడేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి పండుగని పురస్కరించుకుని సోమవారం విడుదలయ్యింది. వెంకటేష్‌లో ఇందులో క్లైమాక్స్ లో కీలక పాత్రలో కాసేపు మెరవగా, నయనతార హీరోయిన్‌గా నటించింది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది.

25
మెగాస్టార్‌ కామెడీ, యాక్టింగ్‌, డాన్సులతో విశ్వరూపం

చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. పూర్తి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. వింటేజ్‌ చిరంజీవిని ఇందులో చూపించాడు అనిల్‌. ఆయన కామెడీ టైమింగ్‌ని ఇందులో బాగా వాడుకున్నారు. చిరు కూడా చాలా రోజుల తర్వాత రెచ్చిపోయి నటించారు. అటు కామెడీకి కామెడీ, యాక్షన్‌కి యాక్షన్, సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్, భార్యా భర్తల మధ్య గొడవలు, మామ తిక్క అణచే ఎలిమెంట్లు, దీనికితోడు స్టయిలీష్‌ యాక్షన్‌ సీన్లు సినిమాకి బాగా కుదిరాయి. బీజీఎం, పాటలు కూడా అదిరిపోయాయి. దీంతో ఈ మూవీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

35
బావ సినిమాపై బామ్మర్ధి అల్లు అరవింద్‌ క్రేజీ రియాక్షన్‌

ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి దీనికి పాజిటివ్‌ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. బావ చిరంజీవి వెండితెరపై ర్యాంపేజ్‌ ఆడిన నేపథ్యంలో దాన్ని చూసి ఆయన ఎంజాయ్‌ చేశారు. ఆనందంతో ఒప్పొంగిపోయారు. ఈ సందర్భంగా `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీకి తన రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయిందన్నారు. `ఘారానా మొగుడు`, రౌడీ అల్లుడు` చిత్రాలను తలపించేలా ఉందని, మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిందన్నారు.

45
అల్లు అరవింద్‌ రివ్యూ

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, `సినిమా చూసి వస్తుంటే ఎగ్జైట్‌మెంట్‌ వేరేలా ఉంది. బాస్‌ చించ్చేశాడు. బాస్‌ ఈజ్‌ బాస్‌. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌. మళ్లీ ఓల్డ్ సినిమాలు రౌడీ అల్లుడు, ఘారానా మొగుడు చూసిన ఎగ్జైట్‌మెంట్‌ వస్తోంది. సాంగ్స్ అదిరిపోయాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో సహా అన్నీ వింటేజ్‌ తీసుకొచ్చాడు భీమ్స్. డైరెక్టర్‌ ఏం ఆలోచించాడనిపించింది. అద్భుతంగా చేశాడు. వెంకటేష్‌ ఎంట్రీ అదిరిపోయింది. చిరంజీవితో కాంబినేషన్‌, క్లైమాక్స్ ఎపిసోడ్‌, ఇలా అన్నీ అదిరిపోయాయి. పైసా వసూల్‌ ఫిల్మ్. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నయనతార, వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి ఇలా ఎవరికీ వాళ్లు రెచ్చిపోయి చేశారు. సూపర్‌` అంటూ వెల్లడించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

55
సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ మన శంకరవర ప్రసాద్‌ గారు

చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీలో వెంకటేష్‌ కీలక పాత్రలో చివర్లో ఎంట్రీ ఇవ్వగా, నయనతార హీరోయిన్ గా నటించింది. అభినవ్‌ గోమటం, హర్షవర్థన్‌, కేథరిన్‌ థ్రెస్సా బుల్లి రాజు, సచిన్‌ ఖేడ్కర్‌, శరత్‌ సక్సేనా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, గోల్డ్ బాక్స్‌ మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా నేడు సోమవారం( జనవరి 12న) విడుదలైంది. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories