Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌

Published : Nov 04, 2026, 07:54 PM IST

Jailer 2 Box Office: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా కర్ణాటకలో కన్నడ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్లలో కొత్త రికార్డు సృష్టించింది. రిలీజైన మొదటి 18 రోజుల్లోనే ఈ సినిమా కన్నడ వెర్షన్ ₹9.54 కోట్లు రాబట్టింది.

PREV
13
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న జైలర్‌ 2

రజనీకాంత్‌ నటించిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడో వారంలోనూ అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఈ క్రమంలో ఇది కన్నడలో సరికొత్త రికార్డుని సృష్టించింది. దశాబ్దాలుగా కర్ణాటక థియేటర్లలో పరభాషా సినిమాలను ఒరిజినల్ భాషలోనే చూసేందుకు జనాలు ఆసక్తి చూపించేవారు. తమిళ, తెలుగు, హిందీ బ్లాక్‌బస్టర్ సినిమాలను కన్నడిగులు ఆయా భాషల్లోనే ఎంజాయ్ చేసేవారు. కానీ, డబ్బింగ్ వెర్షన్లు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు తక్కువే. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది.

కన్నడ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్లలో ‘జైలర్ 2’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రిలీజైన 18 రోజుల్లోనే ఈ సినిమా కన్నడ వెర్షన్ ఏకంగా ₹9.54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియా వైడ్‌గా దీని నెట్ కలెక్షన్స్ ₹7.60 నుంచి ₹7.77 కోట్ల వరకు ఉంటుందని టాక్‌.

23
కన్నడలో పుష్ప 2 రికార్డుని బ్రేక్‌ చేసిన జైలర్‌ 2

ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు ‘జైలర్ 2’ బ్రేక్ చేసింది. ‘పుష్ప 2’ కన్నడ డబ్బింగ్ వెర్షన్ సుమారు ₹9.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టిన ‘జైలర్ 2’, కర్ణాటకలో రిలీజైన పరభాషా డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్‌లో మరో విశేషం ఏంటంటే.. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో కన్నడ వెర్షన్‌కు వస్తున్న రెస్పాన్స్. ఒరిజినల్ తమిళ వెర్షన్ కలెక్షన్లలో సింహభాగం రాబట్టినా, కన్నడ డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా పాత మైసూర్, ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

33
జైలర్‌ 2 అరుదైన రికార్డు

అన్ని భాషల వెర్షన్లు కలుపుకుంటే ఒక్క కర్ణాటకలోనే ‘జైలర్ 2’ టోటల్ కలెక్షన్స్ ₹88 కోట్ల మార్క్‌ను దాటాయి. రజనీకాంత్ స్టార్‌డమ్‌కు తోడు, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ఓ కీలకమైన అతిథి పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్‌తో మూడో వారంలో కూడా కన్నడ వెర్షన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కర్ణాటకలోనే కాదు, వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా ‘జైలర్ 2’ దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ ₹817 కోట్లకు చేరుకుని, ₹800 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలచింది.

‘పుష్ప 2’ రికార్డును దాటేసి ‘జైలర్ 2’ కన్నడ డబ్బింగ్ వెర్షన్ సాధించిన ఈ విజయం కన్నడ సినిమా మార్కెట్ పరంగా చాలా కీలకం. పరభాషా సినిమాలను కన్నడలోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. మంచి కథ, భారీ తారాగణం, అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కన్నడ డబ్బింగ్ సినిమాలకు కూడా బ్రహ్మరథం పడతారని రజనీకాంత్ ‘జైలర్ 2’ మరోసారి ప్రూవ్ చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories