అశ్వినికి సపోర్ట్ గా ప్రియాంక బాయ్‌ ఫ్రెండ్‌ కామెంట్‌.. వాడిపోయిన లేడీ కంటెస్టెంట్‌ ముఖం.. హౌజ్‌లో పెళ్లిగోల..

Aithagoni Raju | Published : Nov 8, 2023 11:37 PM
Google News Follow Us

అశ్విని అందం గురించి కూడా ఆయన ప్రశంసించాడు. రోజాపువ్వులా ఉన్నావని కామెంట్‌ చేశాడు. దీంతో ఇంకెందుకు ఈరోజా పువ్వు ఇచ్చేయ్‌ అని ప్రియాంక సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యింది. 

17
అశ్వినికి సపోర్ట్ గా ప్రియాంక బాయ్‌ ఫ్రెండ్‌ కామెంట్‌.. వాడిపోయిన లేడీ కంటెస్టెంట్‌ ముఖం.. హౌజ్‌లో పెళ్లిగోల..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 పదో వారం ఫ్యామిలీ వీక్‌గా మార్చేశాడు బిగ్‌ బాస్‌. సోమవారం నామినేషన్లతో సరిపెట్టగా, మంగళవారం ఫ్యామిలీ ఎపిసోడ్‌ స్టార్ట్ చేశారు. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొస్తూ ఈ వారాన్ని ఫ్యామిలీ వీక్‌గా మార్చేశారు. ఇప్పటికే అశ్విని, శివాజీ, అర్జున్‌ ప్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చారు. బుధవారం ఎపిసోడ్‌లో మరో ముగ్గురు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇందులో ప్రధానంగా గౌతమ్‌ మదర్‌ వచ్చారు. ఆయనకు పంచె తీసుకొచ్చింది. 

27

అమ్మని చూసి ఎమోషనల్‌ అయ్యాడు గౌతమ్‌. ఆమె చేతితో గోరుముద్దలు తిన్నాడు. అమ్మాయిల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా ఉందని ఆమె చెప్పింది. గౌతమ్‌ బాగా ఆట ఆడుతున్నాడని, కాకపోతే ఆవేశాన్ని కంట్రోల్‌ చేసుకోవాలని, కొన్ని సార్లు మాట జారుతున్నావని ఆమె సలహా ఇచ్చింది. అందరితో ఫ్రీగా మాట్లాడిన ఆమె కాసేపు సందడి చేసి వెళ్లింది. అయితే ఇది చూసిన యావర్ ఒక్కడే పడుకుని కన్నీళ్లు పెట్టుకోవడం బాధగా అనిపించింది.

37

అనంతరం ప్రియాంక బాయ్‌ ఫ్రెండ్‌ శివ కుమార్‌ వచ్చాడు. ఆయన వచ్చి రాగానే తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ప్రియాంకని గట్టిగా హగ్‌ చేసుకున్నారు. శివ రాకని చూసి ఎమోషనల్‌ అయ్యింది ప్రియాంక. కాసేపు ఈ ఇద్దరు గాలి దూరనంతగా వాటేసుకున్నారు. అనంతరం అందరిని సర్‌ అంటూ సంభోదిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు శివ. ప్రతి ఒక్కరి గురించి బాగా చెబుతూ, ప్రశంసిస్తూ మెప్పించారు. 

Related Articles

47

ఇందులో భాగంగా అశ్విని గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. తనని ఎంతో మంది తొక్కేస్తున్నారని, కానీ మీకోసం మీ అభిమానులం ఉన్నామని, సపోర్ట్ చేస్తామని తెలిపాడు. దీంతో ప్రియాంక మొఖం వాడిపోయింది. మరోవైపు అశ్విని అందం గురించి కూడా ఆయన ప్రశంసించాడు. రోజాపువ్వులా ఉన్నావని కామెంట్‌ చేశాడు. దీంతో ఇంకెందుకు ఈరోజా పువ్వు ఇచ్చేయ్‌ అని ప్రియాంక సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యింది. ఒకరికి ఇచ్చింది తాను ఇవ్వలేనని, మరోటి ఇస్తానని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 
 

57

అనంతరం బెడ్‌ రూమ్‌లోనూ ముచ్చట్లు చెప్పుకున్నారు. ప్రియాంకకి హితబోధ చేశాడు శివ. చిన్న చిన్న విషయాలను లాగుతున్నావని, బాగా ఆరుస్తున్నావని, అవి నచ్చడం లేదని తెలిపారు. అనవసరంగా లాగొద్దని, చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి వదిలేయ్‌, కానీ దాన్ని లాగొద్దన్నాడు. అదే సమయంలో హౌజ్‌లో సొంతంగా ఆడాలని, ఎవరితోనూ ఫ్రెండ్స్ షిఫ్‌ అవసరం లేదని, అవన్నీ బయట ఇక్కడ అంతా ఒక్కటే అని తెలిపారు. గట్టిగా అరవడం నచ్చడం లేదని, చాలా విషయాల్లో మార్చుకోవాలని తెలిపారు శివ. 

67

ఇంతలో పెళ్లి మ్యాటర్‌ అడిగింది ప్రియాంక.. షో అయిపోయాక, బయటకొచ్చాక పెళ్లి చేసుకుందామని తెలిపారు. లేదు ఇక్కడే చేసుకుందామని ఆమె చెప్పడ విశేషం. అయితే పెళ్లి గురించి రెండు మూడు సార్లు ప్రియాంక..ప్రియుడిని ఫోర్స్ గా అడిగింది. నమ్మకం ఉంచాలని ఆయన తెలిపారు. ఆమెకి కొన్ని సైగలు చేశాడు. ఆట తీరుపై కూడా కొన్ని హింట్స్ ఇచ్చాడు. అయితే పెళ్లికి సంబంధించిన మ్యాటర్‌ వీరి మధ్య హౌజ్‌లో చర్చకు రావడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రియాంక అంతగా ఇన్‌ సెక్యూరిటీలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తను చాలా మిస్‌ అవుతున్నానని, ఇలాంటి హగ్‌లకోసమే వెయిట్‌ చేస్తున్నానని శివ చెప్పడం విశేషం. ఇది శివలోని మంచితనం బయటపెడితే, ప్రియాంకలోని అసలు రూపాన్ని, ఇన్‌సెక్యూరిటీని బయటపెట్టిందని చెప్పొచ్చు. 

77

ఆ తర్వాత భోలే వైఫ్‌ వచ్చింది. ఆమె కోసం రెండు మూడు సార్లు పాటలు పాడుతూ అలరించారు భోలే. తన కొడుకు గుర్తొస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెపై ప్రేమని వ్యక్తం చేశాడు. పాటలతో అలరించాడు. కప్‌ గెలుచుకుని వస్తానని కాదు, అందరి మనసులను గెలుచుకుని వస్తానని ఆయన తెలిపారు. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ ఆకట్టుకుంది. మొదట హౌజ్‌లో స్కూల్‌ గేమ్‌ ఆడారు. ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడి నవ్వులు పూయించారు. ఆ తర్వాత పాటలతో అటెండెన్స్ తీసుకునే ఎపిసోడ్‌ కూడా హిలేరియస్‌గా నవ్వించింది.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos