కమల్‌ `థగ్‌ లైఫ్‌`.. ఆ హాలీవుడ్‌ విజువల్‌ వండర్‌కి కాపీనా?.. ఇలా దొరికిపోయారేంటి? ట్రోల్స్

Aithagoni Raju | Updated : Nov 08 2023, 08:58 PM IST
Google News Follow Us

కమల్‌ హాసన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `థగ్‌ లైఫ్‌` టైటిల్‌ గ్లింప్స్ వివాదంలో ఇరుక్కుంది. ఇది హాలీవుడ్‌ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం ఊపందుకుంది. ట్రోల్స్ రచ్చ చేస్తున్నాయి. 
 

16
కమల్‌ `థగ్‌ లైఫ్‌`.. ఆ హాలీవుడ్‌ విజువల్‌ వండర్‌కి కాపీనా?.. ఇలా దొరికిపోయారేంటి? ట్రోల్స్

కమల్‌ హాసన్‌(Kamal Haasan) పుట్టిన రోజు సందర్భంగా మణిరత్నం(Maniratnam) మూవీ నుంచి ఫస్ట్ లుక్‌, టైటిల్‌ అనౌన్స్‌ మెంట్‌ గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంటుంది. దాదాపు 36ఏళ్ల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబోలో మరో సంచలనాత్మక మూవీ రాబోతుందని అంతా భావించారు. అప్పట్లో `నాయకుడు` చిత్రంతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సౌత్‌ ఇండియాలోనే మాఫియా బేస్డ్ చిత్రాల్లో బెస్ట్ గా నిలిచింది. 

26

ఇప్పుడు మరో భారీ యాక్షన్‌ మూవీతో `థగ్‌ లైఫ్‌`(Thug Life) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సహాసవీరుడు, బందిపోటు తరహా కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. అంచనాలు పెంచేలా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై కొత్త వివాదం రాజుకుంది. ఇది కాపీ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతుంది. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 
 

36

ఆ మధ్య వచ్చిన హాలీవుడ్‌ సైన్స్ ఫిక్షన్‌ విజువల్‌ వండర్‌ `స్టార్‌ వార్స్` సిరీస్‌లోని `ది రైజ్‌ ఆఫ్‌ స్కై వాకర్‌`(2019) మూవీ నుంచి కాపీ కొట్టారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఆ సినిమా క్లిప్స్ లకు, `థగ్స్ లైఫ్‌`కి పోలికలు తీస్తూ ఇది ముమ్మాటికి కాపీనే అంటున్నారు. ఆ సినిమాలో హీరో సైతం ఓ చిరిగిపోయిన క్లాత్‌ని చుట్టుకుని ప్రత్యర్థులు వచ్చే క్రమంలో దాన్నివిధిల్చి, విలన్లని అంతం చేస్తాడు. 

Related Articles

46

హీరో ధరించిన కాస్ట్యూమ్‌ స్టయిల్‌ నుంచి విలన్ల కాస్ట్యూమ్స్, ఆయుధాలు సైతం మ్యాచింగ్‌ అయ్యేలా ఉన్నాయి. ఏడారిలోనే ఈసీన్లు కూడా ఉండటం విశేషం. ఇలా లుక్‌ నుంచి, ఫైట్‌ సీన్, విలన్ల వరకు ఇలా అన్నీ దగ్గరగా ఉన్నాయి. దీంతో మణిరత్నం ఆ మూవీ నుంచే కాపీ కొట్టాడని సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో రచ్చ రచ్చ అవుతుంది. 

56

అయితే కమల్‌ హాసన్‌ సినిమాలంటే పోస్టర్‌ నుంచి, ప్రతిదీ ఓ ట్రెండ్‌ సెట్టర్‌లా ఉటాయి. ఒకరిని ఫాలో అవడం ఉండదు, తనని ఫాలో అవ్వాల్సిందే, అంతటి అడ్వాన్స్ గా ఉంటారు. మణిరత్నం సినిమాలు కూడా అంతే, చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటిది వీరి సినిమానే కాపీ అనే కామెంట్స్ వైరల్‌గా మారడం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి ప్రూపులు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆడుకోవడం మరింతగా హాట్‌ టాపిక్ అవుతుంది. 
 

66

అయితే జస్ట్ లుక్స్ సేమ్‌ ఉన్నా, రెండు భిన్నమైన మూవీస్‌ అని, సీన్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయని, సంబంధం లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ జరగాల్సిన రచ్చ జరుగుతూనే ఉంది. మరి దీనికి ఎప్పుడు పుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి. ఇక కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. దుల్కర్‌ సల్మాన్‌, జయంరవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ రకంగా ఇది భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతుంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos