ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 39 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది. తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.