అదిరిపోయేలా యాంకర్ శ్రీముఖి ఈద్ ఫెస్టివల్ ట్రీట్.. కండ్లు చెదిరేలా రాములమ్మ అందాలు..

Published : Apr 30, 2022, 12:46 PM IST

బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను మైమరిపిస్తోంది.  ఈద్ పండుగ సందర్భంగా గ్రీన్ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.  

PREV
18
అదిరిపోయేలా యాంకర్ శ్రీముఖి ఈద్ ఫెస్టివల్ ట్రీట్.. కండ్లు చెదిరేలా రాములమ్మ అందాలు..

స్మాల్ స్క్రీన్ బ్యూటీగా యాంకర్ శ్రీముఖి దూసుకెళ్తోంది. వరుస టీవీ షో ఆఫర్లను దక్కించుకుని టెలివిజన్ ఆడియెన్స్ కు ఎంతగానో అలరిస్తోంది. 
 

28

పటాస్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న  ఈ సుందరి.. ఆ తర్వాత బుల్లితెరపై స్టార్ యాంకర్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ తెలుగు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

38

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మరింత పాపులర్ అయ్యిందీ బ్యూటీ. దీంతో టెలివిజన్ ప్రజెంటర్ గా, హోస్ట్ గా వరుస ఆఫర్లను అందుకుంటోంది.
 

48

ప్రస్తుతం, స రి గ మ ప (SaReGaMaPa The Singing Superstar) తెలుగు సింగింగ్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ షోకు ప్రస్తుతం టీవీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే లభిస్తోంది.
 

58

ఈ సింగిల్ రియాలిటీ షో ఇప్పటికే 13 సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 14వ సీజన్ ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ కొనసాగుతోంది. ఈ పాపులర్ షోకు జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ కోఠి, ఎస్పీ శైలజా, స్మితా, అనంత శ్రీరాం వ్యవహరిస్తున్నారు. 

68

జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ షోలో 24 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే శ్రీముఖి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఆకర్షణీయ దుస్తుల్లో రెడీ అయ్యి.. ఫొటూషూట్ నిర్వహించింది.
 

78

ప్రతి ఎపిసోడ్ కు ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ గ్లామర్ ఒళకబోస్తుంటుంది శ్రీముఖి. లేటెస్ట్ ఎపిసోడ్ దిగిన ఫొటోలను తన అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుంది. ఈద్ ఫెస్టివల్ సందర్భంగా గ్రీన్ అవుట్ ఫిట్ ధరించినట్టు  తెలిపింది. 
 

88

ఈ ఫొటోల్లో శ్రీముఖి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గ్రీన్ కలర్ చుడీదార్ లో మెస్మరైజ్ చేస్తోంది. తన అందచందాలతో నెటిజన్లను ఆటాడిస్తోంది. ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపేలా ‘సలామ్’ అంటూ  ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

click me!

Recommended Stories