ఫైనల్ గా తన కూతురు మొహాన్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఫ్యాన్స్ ఏమంటున్నారు.. వైరల్ గా మారిన క్యూట్ పిక్స్!

First Published | Jan 31, 2023, 1:44 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక  (Priyanka Chopra) గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా తన కూతురు మొహాన్ని రివీల్ చేసింది. ఆ క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - పాప్ సింగర్ నిక్ జోనాస్ (Nick Jonas)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట  2018లో ఒక్కటైంది. గతేడాది తల్లిదండ్రులుగానూ వీరిద్దరూ ప్రమోషన్ పొందారు. 
 

 గతేడాది జనవరి 15న ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ సరోగసీ విధానం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. భర్త, కూతురుతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే కూతురు పుట్టినప్పటి నుంచి ప్రియాంక చోప్రా చిన్నారి ఫేస్ ను అభిమానులకు చూపించలేదు. 
 


తన కూతురితో కలిసి ఫొటోషూట్లు చేస్తున్నా.. ఫేస్ కనపడకుండా మాత్రం జాగ్రత్తపడింది. దీంతో బేబీని ఎప్పుడు చూపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారిగా తన కూతుర్ని పబ్లిక్ లోకి తీసుకొచ్చి చూపించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

సోమవారం కుమార్తె మాల్తీ మేరీతో కలిసి మొదటిసారిగా బహిరంగంగా కనిపించింది. నిక్ జోనాస్, అతని టీమ్ కు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక కూతురితో హాజరై సందడి చేశారు. క్రీమ్ స్వెటర్, మ్యాచింగ్ షార్ట్‌లు ధరించిన బేబీ మాల్టీ అందంగా కనిపించింది.
 

ఫంక్షన్ సందర్భంగా ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం తండ్రిలాగే ఉందంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. చిన్నారి యాక్టివ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

పెళ్లి తర్వాత కూడా ప్రియాంక చోప్రా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే హాలీవుడ్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.  ప్రస్తుతం రిచర్డ్ మాడెన్‌తో కలిసి రూస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’లో నటిస్తోంది. మరోచిత్రం ‘లవ్ ఎగైన్’లోనూ నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

Latest Videos

click me!