Priyanka Chopra Income: ప్రియాంక చోప్రా ఒక్క సినిమా సంపాదనే చాలా ఎక్కువ, ఇక ఇళ్లు బంగారం కలిపితే ఎంతో రిచెస్ట్

Published : Apr 20, 2026, 07:11 PM IST

Priyanka Chopra Income: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆమె ఒక్క సినిమాకు తెలుగు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

PREV
15
ప్రియాంక చోప్రా ఆస్తులు ఎంత?

మిస్ వరల్డ్ కిరీటంతో ఒక్కసారిగా ఈ ప్రపంచానికి తెలిసింది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. షారుఖ్, సల్మాన్, హృతిక్, అమీర్, అక్షయ్ వంటి టాప్ హీరోలతో నటించింది. ఆ తర్వాత హాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడే పెళ్లి చేసుకుని కోడలిగా సెటిలైపోయింది. పూర్తిగా అమెరికాకు తాను వలస వెళ్లిపోయింది. ఆమె ఆస్తులు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి.  ఇప్పుడు రూ.700 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించింది. 

25
హాలీవుడ్‌లో సెటిల్

 ప్రియాంక చోప్రా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతుంది.  2016 ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆమె ధరించిన 50 క్యారెట్ల వజ్రాల చెవిపోగులు ధరించింది. వాటి విలువ సుమారు రూ.21.75 కోట్లు. ఒకసారి ఆమె ధరించిన రాల్ఫ్ & రూసో గౌను విలువ రూ.72 కోట్లు అని వార్తలు వచ్చాయి. మరోసారి సుమారు రూ.45 లక్షల విలువైన డ్రెస్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సినిమాలు తగ్గించుకుని, వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ చిత్రాలపై ప్రియాంక దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుకు జోడీగా 'వారణాసి' చిత్రంలో నటిస్తోంది. 

35
ఖరీదైన ఇళ్లు

ప్రియాంక చోప్రా వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు $80 మిలియన్లు ఉంటాయి. భారత కరెన్సీలో సుమారు 670 కోట్ల రూపాయలు దాటి ఉంటుంది. ఆమె భర్త నిక్ జోనస్ ఆస్తులను కూడా కలిపితే, ఈ జంట మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.1,250 కోట్లకు పైగా ఉంటుంది.  ప్రియాంక ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఖరీదైన ఇళ్లను కలిగి ఉంది: లాస్ ఏంజిల్స్ లో భారీ భవనం ఉంది:  కాలిఫోర్నియాలోని ఎన్‌సినోలో సుమారు రూ.144 కోట్ల విలువైన ఒక భారీ భవనం ఆమెకు ఉంది. ఇందులో 7 బెడ్‌రూమ్‌లు, 11 బాత్రూమ్‌లు, ఒక బాస్కెట్‌బాల్ కోర్ట్, బౌలింగ్ అల్లే, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ముంబైలోని జుహూ ప్రాంతంలో సముద్రానికి దగ్గరలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుంది. న్యూయార్క్‌లో ఒక పెంట్‌హౌస్, గోవాలో ఒక హాలిడే హోమ్ వంటి అనేక ఆస్తులు ఆమె కూడబెట్టింది.

45
కోట్ల విలువైన కార్లు

ప్రియాంక వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి:  ఆమె దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. మెర్సిడెస్-మేబ్యాక్ S650 కారును తన భర్త నుండి బహుమతిగా పొందింది ప్రియాంక. ఈ కారు విలువ సుమారు రూ2.73 కోట్లు. బెంట్లీ కాంటినెంటల్ GT కారుకు 2026లో ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు. ఇవే కాకుండా BMW 7 సిరీస్, పోర్షే కయెన్, ఆడి Q7 వంటి లగ్జరీ కార్లు కూడా ఆమె గ్యారేజీలో ఉన్నాయి.

55
వారణాసి సినిమా రెమ్యునరేషన్

ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంది. కొన్ని సినిమాలకు ఆమె 40 కోట్ల రూపాయల వరకు పారితోషికం వసూలు చేస్తోంది. ఇది కాకుండా, బల్గారీ (Bulgari), పాంటీన్ (Pantene), బెంట్లీ (Bentley) వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ ఏటా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది.

సినిమాల్లో నటించడమే కాకుండా, ఆమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.  అనామలీ హెయిర్‌కేర్  పేరుతో ఆమె సొంత హెయిర్ కేర్ బ్రాండ్ నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా అనేక జాతీయ అవార్డులు పొందిన చిత్రాలను నిర్మించింది. అలాగే బంబుల్ (డేటింగ్ యాప్), వర్చువల్ టెక్నాలజీ కంపెనీలలో ఆమె  కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. వీటి ద్వారా కూడా ఆమె కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories