ఆసినిమా అంటే అసహ్యం, ఇష్టం లేకుండానే నటించాను.. ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్

First Published Jun 1, 2023, 10:09 PM IST

ఈమధ్య బాలీవుడ్ కమ్ హాలీవుడ్ హీరోయిన్  ప్రియాంక చోప్రా ఏదో ఒక రకంగా వైరల్ న్యూస్ అవుతుంది. ఆమె చేసే కామెంట్స్.. లేక ఆమె చేసే పనులు ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బ్యూటీ.  

Photo Courtesy: Instagram

బోల్ట్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో.. బాలీవుడ్ ను విమర్షించడంలో ఈమధ్య ముందుంటుంది హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమధ్య ట్రిపుల్ ఆర్ చూడలేదని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆతరువాత తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరోసారి బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది తారలు ఇష్టం లేకున్నా కొన్ని సినిమాలు చేయక తప్పదు. ఎంతపెద్ద స్టార్ కు అయినా.. కెరీర్ లో ఇలాంటి సిచ్యూవేషన్ ఎదురవ్వక మానదు. దర్శకుడికి భయపడో.. సినిమా పెద్దదయో.. ఇలాంటి చాలా కారణాల  వల్ల వారు ఆ సినిమా చేయక తప్పుదు. ఇక  తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా అలాంటి పరిస్థితిని తాను ఎదుర్కొన్నట్టు బోల్డ్ స్టేట్మెంటే చేసింది.

అయితే ప్రియాంక చోప్రా ఆ సినిమా పేరు ఏంటన్నది మాత్రం బయటకు చెప్పలేదు కానీ.. ఆ సినిమా మిగిల్చిన  అనుభవాన్ని మాత్రం శేర్ చేసుకుంది. ఆ సినిమాకు పనిచేసిన అనుభవం  పరమచెత్త అని, ఆ సినిమా చేస్తుంటే అసహ్యమేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.తాజాగా  ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఆ సినిమా పేరు మాత్రం బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం పరమ చెత్త అని వాఖ్యానించింది. 

సెట్స్ లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. సెట్స్ లో ఓ బొమ్మలా కూర్చునేదాన్ని, స్వతహాగా నేను ఆ టైపు కాదు. అందుకే ఆ సినిమా నాకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటన్నది ప్రియాంక చెప్పలేదు.

priyanka chopra

ప్రస్తుతం ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను సాధిస్తుంది. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

click me!