Priyanka chopra
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. బిజీ బిజీ.. తన ఫ్యామిలీని చూసుకోవాలి.. బిడ్డ ఆలనా పాలనాచూసుకోవాలి. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లు.మరో వైపు సినిమా ఫంక్షన్లు.. ఇంకోవైపు సోషల్ మీడియా.. ఇన్నిబాధత్యల నడుమ.. టైట్ షెడ్యూల్ లో ఉంది బ్యూటీ. ఆమెకు ఏమాత్రం తీరక లేదంట. కాని అప్పుడప్పుడు బాలీవుడ్ గురించి స్పందిస్తూ.. కాంట్రవర్సీలు మాత్రం చేస్తుంటుంది ప్రియాంక.
బోల్ట్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో.. బాలీవుడ్ ను విమర్షించడంలో ఈమధ్య ముందుంటుంది హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమధ్య ట్రిపుల్ ఆర్ చూడలేదని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆతరువాత తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు మాత్రం తన పర్సనల్ ఎమోషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది బ్యూటీ.
ఇక ప్రియాంక మాట్లాడుతూ.. అమ్మని అయ్యాక నేను చాలా మారాను అంటున్నది. ఓ బిడ్డకు జన్మనిచ్చాక తనలో వచ్చిన మార్పు గురించి రీసెంట్ గా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మాజీ ప్రపంచసుందరి. ఆమె మాట్లాడుతూ.. నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది. బహుశా అందరు ఆడవాళ్లకూ ఆ ఫీలింగ్ ఉంటుందేమో అని రకరకాల ఆలోచనలు నన్ను వెంటాడాయి అన్నారు.
అంతే కాదు ఈ అనుమానాలతో చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టాను.. దానికితోడు లెక్కకు మించిన సందేహాలు. ఖాళీ దొరికితే చాలు హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ల మెదడు తినేదాన్ని అన్నారు. ఇక తనకు కూతురు పుట్టింన తరువాత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రియాంక. అంతే కాదు ఆడపిల్లను కనడం పెద్ద టాస్క్. ఎంత టెక్నాలజీ పెరిగినా దాని కష్టం దానికుంటుంది. అది స్త్రీలకి మాత్రమే తెలుసున్నారు. బిడ్డను కన్న తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ప్రియాంక.
అంతే కాదు ఏదైనా చేయగలననే ధైర్యం వచ్చింది. బహుశా అమ్మతనంలోనే ఆత్మవిశ్వాసం ఉంటుందేమో. అంతకుముందు శరీరంపై శ్రద్ధ ఉండేదికాదు. ఇప్పుడు తెలీకుండా శ్రద్ధ పెరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇంకా మట్లాడుతూ ‘ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను నంబర్‌వన్‌గా నిలిచాను. నేను కూడా నా కూతుర్ని అలాగే పెంచాలనుకుంటున్నాను’ అన్నారు ప్రియాంక.
ప్రస్తుతం ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను సాధిస్తుంది. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.