'మంగళవారం' హిట్ పక్కా, కానీ పాయల్ రాజ్ పుత్ కెరీర్ ముగిసినట్లేనా.. రిపోర్టర్ నోరు మూయించిందిగా.. 

First Published | Oct 22, 2023, 3:18 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. దీనితో మరోసారి ఆర్ఎక్స్ 100 దర్శకుడినే నమ్ముకుంది పాయల్. 

వీరిద్దరి కాంబోలో రెండోసారి తెరకెక్కుతున్న చిత్రం మంగళవారం. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈసారి అజయ్ భూపతి లవ్ స్టోరీ కాకుండా వెరైటీగా ప్రయత్నించాడు. శనివారం రోజు మంగళవారం చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. బోల్డ్ రొమాన్స్, సస్పెన్స్, హర్రర్ అంశాలతో నిండిపోయిన ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. 


విజువల్ కూడా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అదిరిపోయే బజ్ తీసుకువచ్చింది అనే చెప్పాలి. ఇక పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రొమాన్స్ చేసునేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. కాగా చిత్ర యూనిట్ నేడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి, ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నందిత శ్వేతా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

Payal Rajput

మీడియా సమావేశంలో పాయల్ రాజ్ పుత్ కి ఆసక్తిర ప్రశ్నలు ఎదురయ్యాయి. పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ ట్రైలర్ లో నా పాత్ర కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఎక్స్ 100 తర్వాత హిట్ లేనప్పటికీ ఈ చిత్రం పక్కాగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని పాయల్ పేర్కొంది. 

వివాదాస్పద ప్రశ్నలతో వార్తల్లో నిలుస్తున్న సురేష్ కొండేటి.. పాయల్ రాజ్ పుత్ ని కూడా తన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ ఐదేళ్లకి మించి ఉండదు. మీకీ ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. మీ కెరీర్ కూడా ముగిసినట్లేనా అనే అర్థం వచ్చేలా ప్రశ్నించారు. 

దీనితో పాయల్ రాజ్ పుత్ అతడి నోరు మూయించేలా సమాధానం ఇచ్చింది. అంటే మీ అర్థం ఏంటి.. నా కెరీర్ కూడా మిగిసిపోయిది అనా.. కమాన్.. మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం. . ఓటిటి ఎలా దూసుకుపోతోందో చూడడం లేదా అంటూ పాయల్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. 

Latest Videos

click me!